Balakot Airstrike Update: పాక్ వక్ర బుద్ది మళ్లీ తెరపైకి, బాలకోట్‌ దాడుల్లో 300 మంది ఉగ్రవాదులు హతం, సంచలన వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలలీ

ఓ ఉర్దు చానెల్‌ డిబెట్‌లో పాక్‌ దౌత్యవేత్త ఆఘా హిలాలీ (Former Pakistan Diplomat Agha Hilaly) మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం.

File image of Balakot in Khyber Pakhtunkhwa province of Pakistan and IAF's Mirage 2000 fighter jets. (Photo Credits: PTI)

New Delhi, January 10: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది భారత సీఆర్‌పీఎఫ్‌ సైనికులు వీర మరణం పొందిన సంగతి విదితమే.ఇందుకు ప్రతీకారంగా భారత్‌ బాలకోట్‌ ఉగ్రస్థావరాలపై (Balakot Airstrike ) ఎయిర్‌ స్ట్రైక్స్‌ నిర్వహించింది. ఈ దాడిలో దాదాపు 300 మంది ఉగ్రవాదులు మరణించినట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ప్రతిపక్షాలు దీనిపై రాద్ధాంతం చేశాయి. అదంతా ఒట్టి పుకార్లు అంటూ కొట్టి పారేశాయి. తాజాగా పాకిస్థాన్ మాజీ దౌత్యవేత్త అఘా హిలలీ (Agha Hilaly) సంచలన వ్యాఖ్యలు చేశారు. 2019 ఫిబ్రవరి 26న భారత వాయు సేన నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌లో ( Airstrike) దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఓ టెలివిజన్ డిబేట్‌లో చెప్పారు.

ఓ ఉర్దు చానెల్‌ డిబెట్‌లో పాక్‌ దౌత్యవేత్త ఆఘా హిలాలీ (Former Pakistan Diplomat Agha Hilaly) మాట్లాడుతూ.. ‘భారతదేశం అంతర్జాతీయ సరిహద్దును దాటి.. ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఈ ఘటనలో కనీసం 300 మంది మరణించారు. ఇందుకు మేం బదులు తీర్చుకుంటాం. కానీ మా లక్ష్యం వేరు. మేం వారి హై కమాండ్‌ని టార్గెట్‌ చేశాం. అది మా చట్టబద్ధమైన లక్ష్యం. ఇక మేం సర్జికల్‌ దాడులు జరిగాయి కానీ ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని ప్రకటించాం. వారు ఎంత నష్టం కలిగించారో.. మేం కూడా అంతే నష్టం వారికి కలగజేస్తాం. ఎక్కువ చేయం’ అంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి.

మూడు కోట్ల మందికి తొలి దశలో వ్యాక్సిన్, జనవరి 16 నుంచి ప్రారంభం, దేశంలొ అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్‌పై రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించిన ప్రధాని మోదీ

కాగా 2019 ఫిబ్రవరి 14న జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ వాహనంపై ఉగ్రవాద దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఈ దాడికి తమదే బాధ్యత అని పాకిస్థాన్‌ నుంచి పని చేస్తున్న జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. ఈ దారుణాన్ని అంతర్జాతీయంగా అనేక మంది ఖండించారు. అనంతరం భారత వాయు సేన బాలాకోట్‌లోని ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. అప్పట్లో దీనిపై పాకిస్థాన్ స్పందిస్తూ, తమవైపువారు ఎవరూ మరణించలేదని ప్రకటించింది. తాజాగా అఘా హిలలీ 300 మంది మరణించినట్లు చెప్పడంతో ఈ వార్త ఇప్పుడు హాట్ టాఫిక్ అయింది.

సర్జికల్ స్ట్రైక్స్ జరిగినపుడు 2019 ఫిబ్రవరి 27న వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న యుద్ధ విమానం పాకిస్థానీ విమానంతో పోరాడుతూ, పాక్ భూభాగంలో కూలిపోయిన సంగతి తెలిసిందే. ఆయనను 2019 మార్చి 1న పాకిస్థాన్ విడుదల చేసింది. ఆయన అట్టారీ-వాఘా సరిహద్దు గుండా భారత దేశానికి తిరిగి వచ్చారు.

పాకిస్థాన్ ముస్లిం లీగ్-ఎన్ నేత అయాజ్ సాదిక్ 2020 అక్టోబరులో ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, అభినందన్‌ విడుదల గురించి మాట్లాడారు. ఓ ముఖ్యమైన సమావేశంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ చెప్పిన అంశాలను ప్రస్తావించారు. ఆ రోజు అభినందన్‌ను విడుదల చేసి ఉండకపోతే, అదే రోజు రాత్రి 9 గంటల కల్లా భారత దేశం పాకిస్థాన్‌పై దాడి చేసి ఉండేదని ఖురేషీ అన్నారని చెప్పారు. భారత దేశం యుద్ధానికి సిద్ధంగా ఉందని ఖురేషీ చెప్పేసరికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వా కాళ్లు వణికాయని తెలిపారు. అందుకే అభినందన్‌ను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now