Bandi Sanjay: బండి సంజయ్ కు బీజేపీ బిగ్ పోస్టు, లోక్ సభ ఎన్నికల ముందు జాతీయ స్థాయిలో కీలక పదవి అప్పగించిన అధిష్టానం

యువమోర్చా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, మహిళా మోర్చా నాయకురాలిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జీగా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్‌చార్జీగా రాధా మోహన్ దాస్ లన జేపీ నడ్డా నియమించారు

BJP State President Bandi Sanjay Kumar (Photo Credit: ANI)

New Delhi, JAN 04: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు (Bandi Sanjay) బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమించారు. బీజేపీ అనుబంధ రైతు సంఘం అయిన కిసాన్ మోర్చా (Kisan Morcha) ఇన్‌చార్జీగా బండి సంజయ్ ను బీజేపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నియమించారు. యువమోర్చా ఇన్‌చార్జీగా సునీల్ బన్సల్, మహిళా మోర్చా నాయకురాలిగా బైజయంత్ జే పాండా, ఎస్సీ మోర్చా ఇన్‌చార్జీగా తరుణ్ చుగ్, ఎస్టీ మోర్చా ఇన్‌చార్జీగా రాధా మోహన్ దాస్, ఓబీసీ మోర్చా అధిపతిగా వినోద్ తావడీ, మైనారిటీ మోర్చా ఇన్‌చార్జీగా దుష్యంత్ కుమార్ లను జేపీ నడ్డా నియమించారు.

Sankranti Holidays 2024: జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, హాలిడేస్ ప్రకటన విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం 

బీజేపీ నేతలతో రెండు రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన జేపీ నడ్డా పలు మోర్చాలకు కొత్త నేతలను నియమించారు. నరేంద్రమోదీని మూడోసారి ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతో బీజేపీ ఎన్నికల కోసం కసరత్తు సాగిస్తోంది. 400 లోక్ సభ స్థానాలు కైవసం చేసుకోవాలనే లక్ష్యంతో బీజేపీ వ్యూహాలు రూపొందిస్తోంది.



సంబంధిత వార్తలు