August Bank Holidays: ఆగస్టు నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, మొదటి మూడు రోజులు బ్యాంకులకు సెలవులే, లిస్ట్ మొత్తం ఓ సారి చెక్ చేసుకోండి
రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల అయినా డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది బ్యాంకు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆ నెలల బ్యాంకు సెలవులు (August Bank Holidays) ఏముంటాయో తెలుసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో కూడా బ్యాంకు సెలవులు (August 2020 Holidays) ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి.
New Delhi,July 31: ఈ రోజుతో జూలై నెల ముగిసిపోతుంది. రేపటి నుంచి ఆగస్టు నెల ప్రారంభమవుతుంది. అయితే ఈ నెల అయినా డబ్బు అవసరమున్న ప్రతి ఒక్కరూ వెళ్ళవలసిన ప్రదేశం ఏదైనా ఉందంటే అది బ్యాంకు మాత్రమే. అందుకే ప్రతి ఒక్కరూ ఆ నెలల బ్యాంకు సెలవులు (August Bank Holidays) ఏముంటాయో తెలుసుకుంటారు. ఇక ఆగస్టు నెలలో కూడా బ్యాంకు సెలవులు (August 2020 Holidays) ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ వివరాల ప్రకారం ఆగస్ట్ నెలలో బ్యాంకులకు పలు సెలవులు రానున్నాయి. వ్యాక్సిన్ వచ్చే దాకా పోరాడాల్సిందే, దేశంలో 16 లక్షలు దాటిన కరోనా వైరస్ కేసుల సంఖ్య, ఒక్కరోజు 6,42,588 కరోనా పరీక్షలు నిర్వహణ
ఆగస్టు నెలలో చాలా రోజులు బ్యాంకులు (Bank holidays in August 2020) మూసివేయబడతాయి. దేశవ్యాప్తంగా పలు పట్టణాలలో బక్రీద్ సందర్భంగా 1న బ్యాంకులు పనిచేయవు. ఆగస్టు 2 ఆదివారం, కాబట్టి బ్యాంకులు మూసివేయబడతాయి. ఇక రక్షా బంధన్ కారణంగా ఆగస్ట్ 3న అహ్మదాబాద్, డెహ్రాడూన్, జైపూర్, కాన్పూర్, లక్నో తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు. భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, పాట్నా తదితర ప్రాంతాలలో కృష్ణాష్టమి నేపథ్యంలో 11న బ్యాంకులకు సెలవు ప్రకటించినట్లు తెలుస్తోంది.
మరికొన్ని నగరాలలో 12న జన్మాష్టమి సెలవు ఇచ్చినట్లు బ్యాంకింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఆగస్టు 15న జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్ట్ 22న వినాయక చవితి పండుగ సందర్భంగా పలు ప్రాంతాలలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. ఇక బ్యాంకింగ్ మార్గదర్శకాల ప్రకారం నెలలో ప్రతీ రెండు, నాలుగు శనివారాలలో బ్యాంకులు పనిచేయని సంగతి తెలిసిందే.
నెల పూర్తి సమాచారం ఇదే..
ఆగస్టు నెల మొదటి మూడు రోజులు బ్యాంకులు మూసివుంటాయి. 4-7 మధ్య బ్యాంకు నాలుగు రోజులు కొనసాగుతుంది. ఆగస్టు 8న నెలలో రెండవ శనివారం, ఆగస్టు 9 న ఆదివారం కారణంగా బ్యాంకులకు సాధారణ సెలవు ఉండనుంది. 10, 11 తేదీలు బ్యాంకులు పనిచేస్తాయి. మంగళవారం (ఆగస్టు 11) మరియు ఆగస్టు 12 న శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకుల్లో సెలవు ఉంటుంది. ఆగస్టు 13 న, దేశభక్తుల దినోత్సవం సందర్భంగా, ఇంఫాల్ మండలంలోని బ్యాంకుల్లో సెలవు ఉంటుంది. ఆగస్టు 15 జాతీయ స్వాతంత్ర్య దినోత్సవం.. ఆగస్టు 16 ఆదివారం సెలవు. శ్రీమంత శంకరదేవ్ సందర్భంగా ఆగస్టు 20 న, హరితలికా తీజ్ సందర్భంగా ఆగస్టు 21 న బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు 22 గణేష్ చతుర్థి మరియు నెలలో నాల్గవ శనివారం, కాబట్టి బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 23 ఆదివారం బ్యాంకులు మూసివేయబడతాయి. ఆగస్టు 29 న, కర్మ పూజ మరియు మొహర్రం కారణంగా, బ్యాంకులలో సెలవు ఉంటుంది. ఆగస్టు 30 ఆదివారం. ఇంద్రయాత్ర మరియు ఓనం కారణంగా ఆగస్టు 31 న బ్యాంకులకు సెలవు ఉంటుంది.