Bank Holidays in May: మే నెలలో బ్యాంకు హాలీడేస్ ఇవే! మొత్తం 8 రోజులు మూతపడనున్న బ్యాంకులు, కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ సెలవులు! బ్యాంకులు వెళ్లేముందు ఓసారి ఇది చూసి వెళ్లండి
లాంగ్ వీకెండ్స్ కు (Long Weekends) తోడుగా సాధారణ సెలవులు, పండుగలు కలిపి ఏప్రిల్‌లో మొత్తం 10 రోజులు బ్యాంకులు తెరుచుకోక కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మేలో కూడా రాష్ట్రాలను బట్టి 8 నుండి 13 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు (bank Holidays) రానున్నాయి.
New Delhi, April 29: ఏప్రిల్‌లో బ్యాంకులకు అనేక సెలవులు (bank holidays) వచ్చాయి. లాంగ్ వీకెండ్స్ కు (Long Weekends) తోడుగా సాధారణ సెలవులు, పండుగలు కలిపి ఏప్రిల్‌లో మొత్తం 10 రోజులు బ్యాంకులు తెరుచుకోక కస్టమర్లు లావాదేవీల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మేలో కూడా రాష్ట్రాలను బట్టి 8 నుండి 13 రోజుల వరకు బ్యాంకులకు సెలవులు (bank Holidays) రానున్నాయి. రంజాన్ తో (Ramadan) పటు సాధారణంగా వచ్చే సెలవులు కలిపి తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులు 8 రోజులు తెరుచుకోవు.మే నెలలో బ్యాంక్ పనులు పెట్టుకుంటే.. ఏదైనా పనిమీద బ్యాంకుకు వెళ్లాలనుకుంటే.. మే నెలలో 8 రోజుల పాటు బ్యాంకులు (Banks) పనిచేయవనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అవి కాకుండా మరో ఐదు రోజులు అప్షనల్ హాలిడేస్ (Optional Holidays) కూడా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలలో సెలవుల విషయానికి వస్తే.. 01 మే 2022: ఆదివారం, 03 మే 2022: రంజాన్/ అక్షయ తృ తీయ, 08 మే 2022: ఆదివారం, 14 మే 2022: రెం డో శనివారం, 15 మే 2022: ఆదివారం, 22 మే 2022: ఆదివారం, 28 మే 2022: నాలుగో శనివారం సెలవులు ఉండనున్నాయి.
అవి కాకుండా ఆర్బీఐ (RBI) విడుదల చేసిన సెలవుల జాబితాలో మహర్షి పరశురామ జయంతి (మే 2), రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి (మే 9), బుద్ధ పూర్ణిమ (మే 19), ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజు (మే 24) కూడా ఉన్నప్ప టికీ ఆ సెలవులు అన్ని రాష్ట్రాలకూ వర్తించవు. రవీంద్రనాథ్ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్లో, బుద్ధపూర్ణిమ సందర్భంగా ఉత్తరాదిలోని కొన్ని రాష్ట్రాల్లో, ఖాజీ నజ్రుల్ ఇస్మాల్ పుట్టినరోజున సిక్కింలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉండనుంది.
ఈ సెలవురోజులను దృష్టిలో పెట్టుకొని మే నెలలో మీ బ్యాంకింగ్ వ్యవహారాలను ప్లాన్ చేసుకొండి! లేకపోతే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే హాలీడేస్ ఉన్నప్పటికీ ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్లకు మాత్రం ఇబ్బంది ఉండదని బ్యాంకులు తెలిపాయి.