Bank Holidays in December: డిసెంబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు, నెలలో దాదాపు 13 రోజుల వరకు మూత పడనున్న బ్యాంకులు, పూర్తి వివరాలు ఇవిగోండి!
దేశవ్యాప్తంగా వచ్చే నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు (Bank Holidays). ఈ దఫా క్రిస్మస్ (Chirstmas) కూడా ఆదివారం వస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో వచ్చే నెల మూడో తేదీన, 12,19, 26, 29,30,31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు (Holidays) ఉన్నాయి.
New Delhi, NOV 25: ఈ ఏడాది చివరి నెల డిసెంబర్ (December) మరో వారంలో ప్రారంభం కాబోతున్నది. దేశవ్యాప్తంగా వచ్చే నెలలో 13 రోజులు బ్యాంకులు పని చేయవు (Bank Holidays). ఈ దఫా క్రిస్మస్ (Chirstmas) కూడా ఆదివారం వస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో వచ్చే నెల మూడో తేదీన, 12,19, 26, 29,30,31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు (Holidays) ఉన్నాయి. 4,10,11,18,24,25 తేదీల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. వచ్చే నెలలో మీకు ఏదైనా మీ బ్యాంకు శాఖలో ఏదైనా ముఖ్యమైన పని ఉన్నా.. ఈ సెలవులను చూసుకుని ప్లాన్ చేసుకోవడం బెటర్. వచ్చే నెలలో బ్యాంకింగ్ సెలవులు ఏయే తేదీల్లో ఉన్నాయో చూద్దాం..
డిసెంబర్ 3 (శనివారం) సెయింట్ ఫ్రాన్సిస్ గ్జావియర్ ఫీస్ట్ గోవా
డిసెంబర్ 4 (ఆదివారం) వారాంతపు సెలవు దేశవ్యాప్తం
డిసెంబర్ 10 (రెండో శనివారం) వారాంతపు సెలవు దేశవ్యాప్తం
డిసెంబర్ 11 (ఆదివారం) వారాంతపు సెలవు దేశవ్యాప్తం
డిసెంబర్ 12 (సోమవారం) పా-టోగాన్ నెంజ్‌మింజా సంగ్మా మేఘాలయ
డిసెంబర్ 18 (ఆదివారం) వారాంతపు సెలవు దేశవ్యాప్తం
డిసెంబర్ 19 (సోమవారం) గోవా విముక్తి దినోత్సవం గోవా
డిసెంబర్ 24 ( నాల్గో శనివారం) క్రిస్మస్ ఫెస్టివ్ దేశవ్యాప్తం
డిసెంబర్ 25 (ఆదివారం) వారాంతపు సెలవు దేశవ్యాప్తం
డిసెంబర్ 26 (సోమవారం) క్రిస్మస్ ఉత్సవాలు మిజోరం, సిక్కిం, మేఘాలయ
డిసెంబర్ 29 (గురువారం) గురు గోవింంద్ సింగ్ జీ జయంతి చండీగఢ్
డిసెంబర్ 30 (శుక్రవారం) యూ కియాంగ్ నాంగ్‌బాహ్ మేఘాలయ
డిసెంబర్ 31 (శనివారం) నూతన సంవత్సర వేడుకలు మిజోరం