Bengaluru Boy Missing Case: బెంగుళూరులో మిస్సైన బాలుడు నాంపల్లి మెట్రో దగ్గర తేలాడు, సోషల్‌మీడియా సాయంతో బాలుడిని పట్టుకున్న పోలీసులు

కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ (Boy Missing) కేసును పోలీసులు చేధించారు. మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన అతడిని హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

Bengaluru boy found in Hyderabad (Photo-X)

Hyd, Jan 24: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో 12 ఏళ్ల బాలుడి మిస్సింగ్ (Boy Missing) కేసును పోలీసులు చేధించారు. మూడు రోజుల క్రితం కన్పించకుండా పోయిన అతడిని హైదరాబాద్‌ (Hyderabad)లో పోలీసులు గుర్తించారు. సోషల్‌మీడియా సాయంతో బాలుడి ఆచూకీ తెలియడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.

బుధవారం నాంపల్లి మెట్రో స్టేషన్‌ వద్ద ఏడుస్తూ కనిపించిన బాలుడిని మెట్రో సిబ్బంది గమనించి పోలీసులకు అప్పగించారు. బెంగళూరు నుంచి రైలులో మైసూర్‌ మీదుగా బాలుడు హైదరాబాద్‌ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. బాబు ఆచూకీ తెలియడంతో అతడి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

ఘటన వివరాల్లోకెళితే.. బెంగుళూరుకు చెందిన బాలుడు ప్రణవ్‌(12) డీన్స్ అకాడమీలో 6వ తరగతి చదువుతున్నాడు. ఆదివారం ఉదయం కోచింగ్‌ సెంటర్‌కు వెళ్లిన పిల్లవాడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తుండగా.. వారికి చిక్కుకుండా విద్యార్ధి తప్పించుకుంటూ వచ్చాడు. బాలుడిని గుర్తించిన ప్రదేశాలకు పోలీసులు చేరుకునే సమయానికి, అతను అప్పటికే మరొక చోటుకి పారిపోయాడు.

తమిళనాడు లా యూనివర్సిటీలో దళిత విద్యార్థిపై ర్యాగింగ్, మూత్రం కలిపిన కూల్ డ్రింక్‌ తాగాలని బలవంతం చేసిన సీనియర్లు, సస్పెండ్ చేసిన అధికారులు

సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఉదయం 11 గంటలకు వైట్‌ఫీల్డ్‌లోని కోచింగ్ సెంటర్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు యెమ్లూర్ సమీపంలోని పెట్రోల్ పంపు వద్ద కనిపించాడు. అదే రోజు సాయంత్రం బెంగళూరులోని మెజెస్టిక్ బస్ టెర్మినస్‌లో బస్‌ దిగుతుండగా చివరిగా కనిపించాడు. అప్పటి నుంచి అతడు కనిపించకుండా పోయాడు.

దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కుమారుడి ఆచూకి తెలిస్తే చెప్పాలంటూ సోషల్‌ మీడియా ద్వారా వేడుకున్నాడు. బాలుడు రోడ్డు మీద నడుస్తున్న సీసీటీవీ ఫుటేజీని షేర్‌ చేశారు. అంతేగాక కొడుకును ఇంటికి రావాంటూ అతడి తల్లి ఓ వీడియో కూడా పోస్టు చేశారు. దీంతో బాలుడి ఫోటోను ఆన్‌లైన్‌లో పోస్టు చేస్తూ ప్రచారం చేశారు. మూడు రోజుల తర్వాత బాలుడు హైదరాబాద్‌లో గుర్తించడంతో ప్రణవ్‌ మిస్సింగ్‌ కేసు సుఖాంతమైంది. ప్రస్తుతం అతడు నాంపల్లి అధికారుల సంరక్షణలో ఉన్నాడు. అతడి తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం ఇవ్వడంతో వారు హైదరాబాద్‌ బయల్దేరారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement