Farmer Denied Entry to Metro: మురికి బట్టలు వేసుకున్నాడని రైతును మెట్రో ఎక్కకుండా అడ్డుకున్న సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బందిపై మండిపడిన తోటి ప్రయాణికులు, ఘటనపై బెంగుళూరు మెట్రో స్పందన ఇదే..
ఈ వీడియోలో నగరంలోని ప్రజా రవాణా సంస్థ ‘నమ్మ మెట్రో’లో ఓ రైతును అవమానించినట్లుగా తెలుస్తోంది. ఓ రైతు నాసిరకం బట్టలు వేసుకున్నాడని మెట్రో ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
Farmer Denied Entry to Bengaluru Metro: బెంగళూరు మెట్రో స్టేషన్‌కి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో నగరంలోని ప్రజా రవాణా సంస్థ ‘నమ్మ మెట్రో’లో ఓ రైతును అవమానించినట్లుగా తెలుస్తోంది. ఓ రైతు నాసిరకం బట్టలు వేసుకున్నాడని మెట్రో ఎక్కకుండా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు.
ఈ ఘటనను వినియోగదారులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీడియో వైరల్ కావడంతో ఆ ఉద్యోగిని సర్వీస్ నుండి BMRCL తొలగించింది. బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) దీనిపై వివరణ ఇస్తూ.. నమ్మ మెట్రో అనేది ప్రజా రవాణా. రాజాజీనగర్‌లో జరిగిన ఘటనపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ క్షమాపణలు చెప్పింది.
భారీ కొండచిలువను నమిలి మింగేయబోయిన ఆవు, అది చూసి షాకైన దాని యజమాని, పశువైద్యులు ఏం చెప్పారంటే..
నివేదికల ప్రకారం, రాజాజీనగర్ మెట్రో స్టేషన్ వద్ద ఒక రైతు మెట్రోలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే అతని దుస్తులను చూసిన మెట్రో సిబ్బంది అతడికి ప్రవేశం నిరాకరించారు. ఆ తర్వాత మెట్రో ఉద్యోగి రైతును లోనికి అనుమతించకపోవడంతో ఆగ్రహం చెందిన తోటి ప్రయాణికులు.. ఉద్యోగులతో సంబంధం లేకుండా రైతును మెట్రోలోకి ఎక్కించారు. రైతును అవమానిస్తున్న మెట్రో ఉద్యోగి తీరును ఓ ప్రయాణికుడు తన మొబైల్‌లో బంధించాడు. ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో దీనిపై ఒక పోస్ట్ రాశారు.
Here's Video
Here's Namma Metro Update
ఇది BMRCLని ట్యాగ్ చేసి, మెట్రో VIPలకు మాత్రమేనా? అని ప్రశ్నించాడు. ఈ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలో దుమారం వేగంగా వ్యాపించింది. ‘మంచి దుస్తులు వేసుకుంటేనే మెట్రోలో ప్రవేశిస్తారా? పేదలకు మెట్రో ప్రయాణ సేవలు అందలేదా? ఈ విధంగా రైతన్నను మెట్రోలోకి రానివ్వని రాజాజీనగర్ మెట్రో సిబ్బంది తీరును ప్రజలు వ్యతిరేకించారు.