Bengaluru Police Issue Traffic Advisory: కర్ణాటకలో రెండు నెలల్లో నాలుగోసారి అమిత్ షా పర్యటన, బెంగళూరులో ట్రాఫిక్ ఆంక్షలు ప్రకటించిన పోలీసులు, ఏయే రూట్లలో ఉన్నాయంటే?
ముఖ్యంగా బెంగళూరు (Bengaluru City) సిటీలోని 28 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల కోసం ఆయన బెంగళూరులో పర్యటించనున్నారు.
Bengaluru, March 02: మరికొద్ది రోజుల్లో జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై (Karnataka assembly elections) బీజేపీ అధిష్టానం దృష్టి పెట్టింది. ముఖ్యంగా బెంగళూరు (Bengaluru City) సిటీలోని 28 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం స్వయంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా రంగంలోకి దిగుతున్నారు. పలు అభివృద్ది కార్యక్రమాల కోసం ఆయన బెంగళూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మార్చి 3న బెంగళూరు పోలీసులు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్షన్లు ప్రకటించారు. బళ్లారి రోడ్డు, హెబ్బల జంక్షన్, మెక్రీ సర్కిల్ సహా పలు ప్రాంతాల్లో ఈ ఆంక్షలు (Traffic Advisory) ఉండనున్నాయి.
అయితే ఇప్పటికే గత నెలలో ప్రధాని మోదీ, అమిత్ షాలు కర్ణాటకలో పర్యటించారు. శివమొగ్గ ఎయిర్ పోర్టును ప్రధాని మోదీ ప్రారంభించారు. అంతకుముందు అమిత్ షా మంగళూరులో పర్యటించారు. ఇక జనవరిలో మాండ్యా, బెళగావిల్లో జరిగిన ర్యాలీల్లో పాల్గొన్నారు. తాజాగా బెంగళూరు సహా బళ్లారిలో జరిగే సభల్లో అమిత్ షా పాల్గొంటారు. ప్రధాని మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తారు. తొలుత బళ్లారిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు, ఆ తర్వాత 65 ఏళ్ల భారత రాజకీయాలు, ప్రధాని మోదీ పాలనలో జరిగిన మార్పులు అనే అంశంపై కార్యకర్తలతో ఇంటరాక్షన్ నిర్వహిస్తారు.