Bengaluru Shocker: బెంగుళూరులో దారుణం, సహజీవనం చేస్తున్న జంట మంటల్లో సజీవ దహనం, దర్యాప్తులో ఏం తేలిందంటే..

కుటుంబంలో తలెత్తిన గొడవలతో సహజీవనం చేస్తున్న ఓ జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న చుట్టు పక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది.

Representative Photo (Photo Credit: PTI)

Bengaluru, Nov 9: బెంగుళూరులో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కుటుంబంలో తలెత్తిన గొడవలతో సహజీవనం చేస్తున్న ఓ జంట నిప్పంటించుకుని సజీవ దహనమయ్యారు. వారి అరుపులు విన్న చుట్టు పక్కల వాళ్లు కాపాడేందుకు ప్రయత్నించినా వారిని కాపాడలేకపోయారు. కర్ణాటక రాజధాని బెంగుళూరులో ఈ విషాదకర ఘటన జరిగింది.

ఘటన వివరాల్లోకెళితే.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 20 ఏళ్ల సౌమినిదాస్ బెంగూళూరులోని ఓ ప్రైవేట్ కాలేజీలో నర్సింగ్ కోర్స్ రెండో సంవత్సరం చదువుతుంది. కేరళకు చెందిన 29 ఏళ్ల అభిల్ అబ్రహం బెంగూళూరులో నర్సింగ్ సర్వీస్ ఏజెన్సీ నిర్వహిస్తున్నాడు.  కొన్ని నెలల కిందటనే వీరిద్దరికి పరిచయం ఏర్పడి అది కాస్తా సహజీవనానికి దారి తీసింది. ఇద్దరూ కలిసి బెంగుళూరులోని కొత్తనూర్ ప్రాంతంలోని ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు.

కర్ణాటకలో దారుణం, భార్యపై అనుమానంతో చున్నీ బిగించి హత్య చేసిన భర్త, అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం

అయితే ఆదివారం సౌమిని దాస్, అభిల్ అబ్రహం కలిసికట్టుగా నిప్పంటించుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారి అరుపులు, కేకలు గమనించిన ఇరుగుపొరుగు వారు తలుపులు బద్దలు కొట్టి వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఈలోపే మంటల్లో కాలి సౌమిని మరణించింది. అభిల్ ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.

ఈ విషయం తెలుసుకున్న బెంగుళూరు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో  అంతకుముందే పెళ్లైన సౌమిని దాస్ ఇటీవలే పశ్చిమ బెంగాల్ లోని సొంతూరుకు వెళ్లినట్లు గుర్తించారు. భర్తను వదిలేసి అభిల్ తో సహజీవనం చేస్తున్న చేయడం వల్ల కుటుంబంలో గొడవలు జరిగినట్లు అనుమానిస్తున్నారు.