Bhandara Hospital Fire: మాటలకందని విషాదం, 10 మంది పిల్లలు మంటలకు ఆహుతి, మహారాష్ట్రలో భండారా జిల్లా ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం, విచారం వ్యక్తం చేసిన హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ

రాష్ట్రంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో (Bhandara Hospital Fire) 10మంది పిల్లలు మరణించారు. భండారా జిల్లా ఆసుపత్రిలోని (Bhandara Hospital) పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సియూ) లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు.

Visuals from inside the hospital in Bhandara where the fire erupted | (Photo Credits: ANI)

Bhandara, January 9: మహారాష్ట్రలో పెను విషాదం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని భండారా జిల్లా ఆసుపత్రిలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో (Bhandara Hospital Fire) 10మంది పిల్లలు మరణించారు. భండారా జిల్లా ఆసుపత్రిలోని (Bhandara Hospital) పిల్లలున్న కేర్ యూనిట్ (ఎస్ఎన్‌సియూ) లో శనివారం తెల్లవారుజామున 2 గంటలకు మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదం జరిగిన సమయంలో ఆసుపత్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో 17 మంది పిల్లలుండగా వారిలో ఏడుగురిని రక్షించారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో డ్యూటీలో ఉన్న ఓ నర్సు గదిలో పొగ రావడం గుర్తించింది. ఆ తర్వాత నర్సు ఆసుపత్రి అధికారులను అప్రమత్తం చేసింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. అగ్నిప్రమాదంలో పదిమంది పిల్లలు మరణించడంతో భండారా ఆసుపత్రిలో విషాదం అలముకుంది.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా విచారం వ్యక్తం చేశారు. మాటలకు అందని విషాదం అని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

బంఢారా జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జరిగిన ఘటన విషాదకరమైందని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ రాహుల్‌ గాంధీ అన్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. మహారాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.



సంబంధిత వార్తలు

AP Rain Update: ఏపీ వర్షాలపై కీలక అప్‌డేట్ ఇదిగో, 24 గంటల్లో అల్పపీడనం ఉత్తరం వైపుగా పయనించి ఏపీ తీరం వెంబడి వెళ్లే అవకాశం, కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన

Fire Accident in Jaipur: సీఎన్‌ జీ ట్యాంకర్‌ ను ఢీకొట్టిన ట్రక్కు.. పెట్రోల్‌ బంక్‌ లో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురి సజీవ దహనం మరో 35 మందికి గాయాలు.. జైపూర్ లో ఘటన (వీడియో)

Mumbai Boat Accident Update: ముంబై బోటు ప్రమాదం, గల్లంతైన వారి కోసం ఇంకా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, ఆసుపత్రిలో చేరిన 105 మందిలో 90 మంది డిశ్చార్జ్, ఇద్దరి పరిస్థితి విషమం

Jagan Slams Chandrababu Govt: పలావు పోయిందీ, బిర్యానీ పోయింది, చంద్రబాబు మీద మండిపడిన వైఎస్ జగన్, విజన్‌ 2047 పేరిట మరో డ్రామా జరుగుతుందని వెల్లడి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif