Bharat Bandh on 26 Feb: అలర్ట్ టైం..ఈ నెల 26న భారత్ బంద్, పెట్రోలు పెంపు, వస్తు, సేవల పన్ను, కొత్త ఈ-వే బిల్లు వంటి విధానాలపై నిరసన వ్యక్తం చేసిన ట్రేడ్ అసోసియేషన్లు, బంద్‌కు పిలుపునిచ్చిన సీఏఐటీ

కేంద్రం వెంటనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) (Goods and services tax (GST)) విధానాన్ని సమీక్షించాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Bharat Bandh 2021 Protests | File Photo

New Delhi, Feb 24: కేంద్ర ప్రభుత్వం వరుసగా ధరలను పెంచుకుంటూ పోతుండటంతో దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 26న భారత్ బంద్ నిర్వహించాలని కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (సీఏఐటీ) ఇచ్చిన పిలుపునకు దాదాపు 40 వేల ట్రేడ్ అసోసియేషన్లు మద్దతు (Bharat Bandh on 26 Feb) పలికాయి. కేంద్రం వెంటనే వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) (Goods and services tax (GST)) విధానాన్ని సమీక్షించాలని ఈ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

మరోవైపు కొత్త ఈ-వే బిల్లు విధానాన్ని, కొన్ని నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్‌కు ఆలిండియా ట్రాన్స్‌పోర్టర్స్ వెల్ఫేర్ అసోనియేషన్ (ఏఐటీడబ్ల్యూఏ) మద్దతు పలికింది. దేశవ్యాప్తంగా డీజిల్ ధరలు (Fuel Price Hike) ఏకరీతిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఏఐటీడబ్ల్యూఏ డిమాండ్ చేస్తోంది.

ఏఐటీడబ్ల్యూఏ అధ్యక్షుడు మహేంద్ర ఆర్య మాట్లాడుతూ, అన్ని రాష్ట్ర స్థాయి ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్లు బంద్‌కు మద్దతిస్తున్నట్లు ధ్రువీకరించాయన్నారు. డీజిల్ ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా నిరసన తెలిపేందుకు ఒక రోజు బంద్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త ఈ-వే బిల్లు నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. డీజిల్ ధరలు దేశవ్యాప్తంగా ఒకేవిధంగా ఉండాలన్నారు. డీజిల్ ధరలను తగ్గించాలని కోరారు.

ముంచుకొస్తున్న కరోనా పెనుముప్పు, తెలంగాణలో కొత్త కరోనా వైరస్, మహారాష్ట్ర, కేరళలో రెండు రకాల వైరస్‌లు, దేశంలో తాజాగా 13,742 కొత్త కేసులు, కరోనాతో 2 కోట్ల ఏళ్ల జీవితకాలం నష్టం సంభవించిందని తెలిపిన ఓ అధ్యయనం

సీఏఐటీ ఆదివారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. జీఎస్‌టీ విధానాలపై ఆందోళన వ్యక్తం చేసింది. మేజర్ ఈ-టెయిలర్స్ ఈ-కామర్స్ రూల్స్‌ను ఉల్లంఘిస్తున్నారని తెలిపింది. జీఎస్‌టీ స్ట్రక్చర్‌ను సమీక్షించి, ప్రభుత్వానికి సిఫారసులు చేయడానికి ఓ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఈ కమిటీలో సీనియర్ అధికారులు, సీఏఐటీ ప్రతినిధులు, ఇండిపెండెంట్ ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్‌ను నియమించాలని కోరింది.