Coronavirus Cases in TS (Photo Credits: PTI)

New Delhi, Feb 24: దేశంలో గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే స‌మ‌యంలో 14,037 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,30,176 కు (India Covid Updates) చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 104 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,56,567 కు (Covid Deaths) పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,26,702 మంది కోలుకున్నారు.

1,46,907 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,21,65,598 మందికి వ్యాక్సిన్ వేశారు. కాగా, దేశంలో నిన్నటి వరకు మొత్తం 21,30,36,275 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న 8,05,844 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.

కరోనా బారినపడి ఇప్పటి వరకు దాదాపు 25 లక్షల మందికిపైగా (Coronavirus Deaths) మరణించారు. ఫలితంగా సుమారు 2 కోట్ల ఏళ్ల జీవితకాలం నష్టం సంభవించిందని ఓ అధ్యయనం పేర్కొంది. భారత్‌తోపాటు 81 దేశాలకు చెందిన కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించిన అనంతరం అంతర్జాతీయ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. అధ్యయన వివరాలు ‘సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కరోనా (Coronavirus) కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి సరాసరి ఆయుర్ధాయాన్ని లెక్కగట్టిన పరిశోధకులు వారి కారణంగా 2,05,07,518 సంవత్సరాల జీవితకాలాన్ని కోల్పోయినట్టు అంచనా వేశారు.

మూడు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల కలకలం, దేశంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి, సరిహద్దు వద్ద ఆంక్షలు కఠినం

హృద్రోగ వ్యాధుల వల్ల కలిగే ఇయర్స్ ఆఫ్ లైఫ్ లాస్ట్ (వైఎల్ఎల్) కంటే ఈ నష్టం 25 నుంచి 50 శాతం ఎక్కువని తేల్చారు. ఈ అధ్యయనంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్‌సిన్-మాడిసన్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాక్స్‌ప్లాంక్ ఇనిస్టిట్యూట్ వంటి అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు పాల్గొన్నారు. కాగా, కరోనా మరణాలు సంభవిస్తున్న దేశాల్లో 44 శాతం పురుషుల జీవన కాలం నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు.

మహారాష్ట్ర‌లో క‌రోనా కేసులు (Maharashtra Covid Cases) పెరుగుతున్న నేపథ్యంలో మంత్రి సంజయ్ రాథోడ్ వేలాది మందితో పోహ్రా దేవి ఆలయాన్ని సందర్శించారు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. ముంద‌స్తు ప్ర‌ణాళిక ప్ర‌కార‌మే ఈ ఘ‌ట‌న చోటు చేసుకున్న‌ట్లు విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. వేలాది మందిని పోలీసులు అదుపుచేయ‌లేపోయారు. వారిపై లాఠీచార్జి చేయాల్సి రావ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. ఈ ఘ‌ట‌న‌పై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక‌రే దర్యాప్తునకు ఆదేశించారు.

రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం, దేశంలో తాజాగా 10,584 మందికి కరోనా, బెంగళూరులో బిల్డింగ్ సీజ్

మహారాష్ట్రలోని లాతూర్‌లో 39 మంది హాస్టల్‌ విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఐదుగురు సిబ్బందికీ పాజిటివ్‌ వచ్చింది. ఈ హాస్టల్‌లో 360 మంది విద్యార్థులు, 60 మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉంటున్నారు. వీరిలో 9, 10 తరగతులకు చెందినవారికి వైరస్‌ సోకింది. తొలుత ఒక విద్యార్థినికి కరోనా నిర్ధారణ అయింది. పరీక్షలు చేయగా అదే గదిలోని 13 మంది విద్యార్థినులకూ పాజిటివ్‌గా తేలింది. సిబ్బందిలో మరో 25 మంది పరీక్షల ఫలితం రావాల్సి ఉంది.

పంజాబ్ రాష్ట్రంలో తాజాగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం వైద్యాధికారులను ఆందోళనకు గురిచేస్తోంది. పంజాబ్ రాష్ట్రంలో పాఠశాలలు పునర్ ప్రారంభించడంతో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. అమృత్‌సర్ నగరంలో 4వేల మంది పాఠశాల ఉపాధ్యాయులకు పరీక్షలు చేయగా, వారిలో 13 మందికి కరోనా పాజిటివ్ అని వెల్లడైంది. పాఠశాల ఉపాధ్యాయులకు కరోనా సోకడంతో 48 గంటలపాటు పాఠశాలలను మూసివేసి, శానిటైజేషన్ చేపట్టారు.పంజాబ్ రాష్ట్రంలో కరోనా కట్టడికి మార్చి 1వతేదీ నుంచి ఆంక్షలు విధించాలని ఆ రాష్ట్ర సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. ఇండోర్ లో 100మంది, అవుట్ డోర్ సమావేశాల్లో 200 మందికి మించకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

ఇదిలా ఉంటే కరోనా వైరస్‌లో మరో రెండు రకాలను గుర్తించారు. ప్రతి రోజు మళ్లీ వేలాది కేసులు వెలుగుచూస్తున్న మహారాష్ట్ర, కేరళలో N440K, E484K రకాలను గుర్తించినట్టు కేంద్రం తెలిపింది. అంతేకాదు, ఇందులో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని పేర్కొంది. అయితే, పైన చెప్పిన రెండు రాష్ట్రాల్లో కేసుల పెరుగుదలకు ఈ కొత్త రకాలే కారణమని చెప్పలేమని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ తెలిపారు. ఇప్పటి వరకు 3,500 వైరస్ జన్యు పరిమాణ క్రమాలను విశ్లేషించగా, అందులో 187 మందిలో బ్రిటన్ రకం, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తిలో బ్రెజిల్ రకం వైరస్ సోకినట్టు గుర్తించినట్టు చెప్పారు. వీటి తదుపరి మ్యుటేషన్లపైనా దృష్టిసారించినట్టు తెలిపారు

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కారు ఆయా రాష్ట్రాల ప్రయాణికులపై ఆంక్షలు విధించింది. దేశంలోని మహారాష్ట్ర, కేరల, చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే ప్రయాణికులు కరోనా వైరస్ నెగిటివ్ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తామని ఢిల్లీ సర్కారు ప్రకటించింది. ఐదు రాష్ట్రాల్లో వ్యాప్తిచెందుతున్న కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు ఢిల్లీ సర్కారు ఫిబ్రవరి 26 నుంచి మార్చి 15వతేదీ వరకు ఆంక్షలు విధించింది. దేశంలో గత 24 గంటల్లో 13,742 మందికి కరోనా సోకగా, వారిలో 104 మంది మరణించారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ బుధవారం వెల్లడించింది.

దేశ‌వ్యాప్తంగా వ్యాక్సిన్ కోసం రిజిస్ట్రేష‌న్ చేసుకున్న‌ 42 శాతం మంది ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్లు తొలి డోసు కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో 9 రాష్ట్రాలు 60 శాతం దాటాయి. ఫిబ్ర‌వ‌రి రెండో తేదీన తొలి వ్యాక్సిన్ తీసుకున్న హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు.. రెండ‌వ డోసును 62 శాతం మంది మాత్ర‌మే తీసుకున్నారు.

దేశ‌వ్యాప్తంగా టీకా తీసుకున్న హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల సంఖ్య 1.19 కోట్లు దాటిన‌ట్లు కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. మంగ‌ళ‌వారం నాటికి 1,19,07,392 మందికి వ్యాక్సిన్ ఇచ్చిన‌ట్లు ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. దీంట్లో హెల్త్‌కేర్ ల‌బ్దిదారులు 64,71,047 మంది తొలి డోసు తీసుకున్నారు. 13,21,635 మంది రెండ‌వ డోసు తీసుకున్నారు. ఇక ఫ్రంట్‌లైన్ వ‌ర్క‌ర్ల‌లో 41,14,710 మంది తొలి డోసు తీసుకున్నారు. జ‌న‌వ‌రి 16వ తేదీ నుంచి దేశ‌వ్యాప్తంగా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైన విష‌యం తెలిసిందే.