New Covid Strain in India: మూడు రాష్ట్రాల్లో కొత్త కరోనా కేసుల కలకలం, దేశంలో వేగంగా పెరుగుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులు, పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ అమల్లోకి, సరిహద్దు వద్ద ఆంక్షలు కఠినం
India’s COVID-19 (photo-PTI)

New Delhi, February 23: దేశంలో కొత్త రకం కరోనా వైరస్‌ కేసులు వెలుగు చూడటం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. దేశవ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర, కేరళ, తెలంగాణల్లో N440K, N484K వైరస్‌లు బయటపడటం కలకలం రేపుతోంది. కొత్త రకం స్ట్రెయిన్‌ వల్లే కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 Cases in India) వేగంగా పెరుగుతున్నట్టు వైద్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్యంగా మహారాష్ట్ర, పంజాబ్‌, కేరళ, కర్ణాటకలో ఈ కొత్త రకం వైరస్‌ (COVID-19 Surge in India) ఎక్కువగా విస్తరిస్తోంది. మహారాష్ట్రంలో అత్యధికంగా కొత్త కేసులు నిర్థారణ కావడంతో కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ విధిస్తున్నారు. పూణె, అమరావతి, నాగపూర్, యావత్మల్‌ వంటి ప్రాంతాల్లో కఠిన చర్యలకు ఉపక్రమించారు. పలు ప్రాంతాల్లో పాఠశాలనను సైతం మూసివేశారు. కొత్త రకం కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పంజాబ్‌ ప్రభుత్వం సైతం చర్యలు చేపట్టింది. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ అధికారులను ఆదేశించారు.

ఇక కర్ణాటక, మహారాష్ట్రంలో కరోనా విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయా రాష్ట్రాలతోగల సరిహద్దు జిల్లాల్లో నిఘా పెంచాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఆదేశించారు. అక్కడి నుంచే వారికి ఖచ్చితంగా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. మహారాష్ట్రలో గత 24 గంటల్లో కొత్తగా 6 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజా సమాచారం ప్రకారం.. మంగళవారం నాడు కొత్తగా 6218 కేసులు నమోదయ్యాయి. 51 కరోనా మరణాలు సంభవించాయి.

రాష్ట్రాల సరిహద్దుల్లో మళ్లీ కఠిన ఆంక్షలు, రోజు రోజుకు పెరుగుతున్న కరోనా కేసులు, అయిదు రాష్ట్రాల్లో కోవిడ్ కల్లోలం, దేశంలో తాజాగా 10,584 మందికి కరోనా, బెంగళూరులో బిల్డింగ్ సీజ్

గ‌తేడాది క‌రోనా వ్యాప్తి జ‌రిగిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 26 మంది మంత్రుల‌కు క‌రోనా సోకింది. గ‌త నెల రోజుల్లో ఏడుగురు మంత్రుల‌కు క‌రోనా వ్యాపించింది. 26 మంది మంత్రుల్లో అత్య‌ధికంగా ఎన్సీపీకి చెందిన వారు 13 మంది ఉన్నారు. మిగ‌తా 13 మంది మంత్రుల్లో ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కాగా, ఐదుగురు శివ‌సేన‌కు చెందిన వారు, ఒక‌రు స్వ‌తంత్ర అభ్య‌ర్థి ఉన్నారు. ఇటీవ‌ల క‌రోనా సోకిన ఏడుగురు మంత్రుల్లో అనిల్‌ దేశ్‌ముఖ్‌, రాజేంద్ర షింగ్నే, జయంత్‌ పాటిల్‌, రాజేశ్‌ తోపే, సతేజ్ పాటిల్‌, బచ్చు క‌దూ, ఛగన్‌ భుజ్‌బల్ ఉన్నారు.

ఇదిలా ఉంటే కేరళలో కేసులు ఎక్కువగా నమోదవడంలో కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మరింది. కేరళ-కర్ణాటక మధ్య సరిహద్దుల్ని మూసివేస్తూ యడియూరప్ప ఆదేశాలు జారీచేశారు. కేరళలో కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతున్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంపై కేరళ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యడ్డ్యూరప్ప నిర్ణయాన్ని తప్పుపడుతూ కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులను వెంటనే తెరపాలని కోరారు.

మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్‌, డిసెంబర్‌లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా

కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుండడంతో అప్రమత్తమైన మధ్యప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధిస్తూ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. అలాగే, బాఘ్‌పట్ జిల్లాలో ఇతర ఆంక్షలు విధించింది. ఈ జిల్లా మహారాష్ట్రను ఆనుకుని ఉండడం, అక్కడ గత కొన్ని రోజులుగా ప్రతి రోజూ 5 వేలకు పైగా కేసులు నమోదవుతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్‌ ప్రకారం.. ఒకే చోట ఐదుగురు వ్యక్తులు గుమికూడి ఉండడం నిషేధం. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిస్థాయి కర్ఫ్యూ అమల్లో ఉంటుంది. అత్యవసర సమయంలో తప్పితే ప్రజలు కానీ, వాహనాలు కానీ రోడ్డుపైకి రావడానికి అనుమతి ఇవ్వరు. అలాగే, ఎక్కువ మంది ఒకే చోట గుమికూడడం నిషేధం. ఒకేవేళ ఏదైనా సమావేశం నిర్వహించాలంటే అధికారుల నుంచి ముందస్తు అనుమతి అవసరం.