Bharat Bandh Today: దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న భారత్ బంద్, 30 వేల టియర్ గ్యాస్ సెల్‌లను సిద్ధం చేసుకున్న పోలీసులు, రైతు సంఘాలతో కేంద్రం జరిపిన మూడోరౌండ్ చర్చలు విఫలం
తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది.
New Delhi, Feb 16: పంటల కనీస మద్దతు ధరకు (MSP) చట్టబద్ధత కల్పించాలని డిమాండు చేస్తూ ఢిల్లీ శివారుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. తమ డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ రైతు సంఘాలు పిలుపునిచ్చిన భారత్ బంద్ శుక్రవారం ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితుల నడుమ కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఢిల్లీ - నోయిడా మార్గాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఇక పంజాబ్‌లో బస్సులు బస్టాప్‌లకే పరిమితమయ్యాయి. ఢిల్లీలో రైతుల నిరసనలో విషాదం, గుండెపోటుతో జ్ఞాన్ సింగ్ అనే రైతు మృతి, శంభు సరిహద్దులో జరిగిన నిరసనలో పాల్గొన్న తరువాత ఛాతి నొప్పితో విలవిల
ఢిల్లీవైపు తరలివస్తున్న రైతులను నిలువరించేందుకు సరిహద్దు భద్రతా దళ అధికారులు 30 వేల టియర్ గ్యాస్ సెల్‌లను సిద్ధం చేసుకున్నారు. నిరసనలు నాలుగో రోజుకి చేరుకోవడంతో గురువారం అర్ధరాత్రి నోయిడా పోలీసులు 144 సెక్షన్ విధించారు.ఢిల్లీ - హరియాణా సరిహద్దులోని టిక్రీ, సింగు అనే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.బారికేడ్లు, ఇనుప మేకులు, ముళ్ల తీగలతో రైతులను అడ్డగిస్తున్నారు.
Here's Video
ఇక రైతు సంఘాల నేతలతో చండీగఢ్‌లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. డిమాండ్లపై మరోసారి ఆదివారం సాయంత్రం 6 గంటలకు చర్చలు జరుగనున్నాయి.