Bihar: పోలీస్ నియామకాలు త్వరగా చేపట్టండి, డీజేపీకి చేతులు జోడించి అభ్యర్థించిన సీఎం నితీష్ కుమార్, వీడియో ఇదిగో..
ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Patna, Oct 21: బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) పోలీస్ రిక్రూమ్‌మెంట్‌ను వేగవంతం చేయాలంటూ చేతులు జోడించి డీజీపీని అభ్యర్థించారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్‌కు అయ్యారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొత్తగా నియమితులైన 1,239 మంది పోలీసు అధికారులకు అపాయింట్‌మెంట్ లెటర్లను సీఎం నితీశ్ కుమార్ సోమవారం అందజేశారు.
ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం మాట్లాడుతూ..పోలీస్ రిక్రూట్‌మెంట్‌ను వేగవంతం చేయాలని, పోలీస్ శాఖలో మహిళల సంఖ్యను 35 శాతానికి పెంచాలని హోం శాఖ కార్యదర్శి, డీజీపీని కోరారు. ఈ సందర్భంగా నితీశ్ కుమార్ చేతులు జోడించి డీజీపీ అలోక్ రాజ్ వైపు తిరిగి మాట్లాడారు. ‘రిక్రూట్‌మెంట్‌ను మీరు త్వరగా పూర్తిచేస్తారా?’ అని అడిగారు. బీహార్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Bihar CM Nitish Kumar Folds Hands Before DGP
డీజీపీ అలోక్ రాజ్ వెంటనే కుర్చీ నుంచి పైకి లేచి సీఎం నితీశ్ కుమార్‌కు సెల్యూట్ చేశారు. ఆ తర్వాత మైక్ వద్దకు వెళ్లి ఆయన మాట్లాడారు. ‘గౌరవనీయులైన ముఖ్యమంత్రి ఆదేశాలను అమలు చేయడానికి బీహార్ పోలీసులు కట్టుబడి ఉన్నారు. మేం త్వరగా రిక్రూట్‌మెంట్ నిర్వహించి పటిష్టమైన శిక్షణ ఇస్తాం’ అని అన్నారు. దీంతో ‘ధన్యవాదాలు’ అని సీఎం నితీశ్ కుమార్ బదులిచ్చారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.