Condoms to Migrant Labourers: వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లు, అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం

సొంత రాష్ట్రానికి తరిగొచ్చి 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న బీహార్ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌ల (Condoms to Migrant Labourers) పంపిణీ చేస్తోంది. ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు వారికి కండోమ్‌లను అందిస్తోంది. వలస కార్మికులకు (Migrant Labourers) 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు.

Migrants | Representational Image (Photo Credits: PTI)

Patna, June 2: లాక్‌డౌన్ సమయంలో అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు బీహార్ ప్రభుత్వం (Bihar government) కీలక నిర్ణయం తీసుకుంది. సొంత రాష్ట్రానికి తరిగొచ్చి 14 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్న బీహార్ వలస కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఉచితంగా కండోమ్‌ల (Condoms to Migrant Labourers) పంపిణీ చేస్తోంది. ఇళ్లకు తిరిగి వెళ్లే ముందు వారికి కండోమ్‌లను అందిస్తోంది. వలస కార్మికులకు (Migrant Labourers) 14 రోజుల క్వారంటైన్‌ ముగిసిన అనంతరం తిరిగి హోం క్వారంటైన్‌కు తరలించేముందు అధికారులు వీరికి కండోమ్‌లను ఉచితంగా అందజేస్తున్నారు. ఇకపై హెయిర్‌కట్‌ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు,మొబైల్ నంబర్ తప్పనిసరి, చెన్నైలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు విధించిన తమిళనాడు సర్కారు

హోం క్వారంటైన్‌లో ఉన్న సమయంలో అవాంఛిత గర్భాలను అడ్డుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ ముగిసిన అనంతరం అవాంఛిత గర్భాలు సంఖ్య పెరిగినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే దీనికి కరోనా మహమ్మారికి ఎటువంటి సంబంధం లేదిన వారు స్పష్టం చేస్తున్నారు. క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న వారికి ముందుగా కౌన్సిలింగ్ ఇస్తామన్నారు.

అవాంఛి గర్భధారణ గురించి వారికి వివరించడమే కాకుండా దీన్ని నివారించేందుకు కండోమ్‌లు అందజేస్తున్నామన్నారు. మరోవైపు.. ఆశా వర్కర్లు ఇంటింటికీ వెళ్లి హోం క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి ఇవి ఇస్తున్నారు. ఇక రాష్ట్రంలో క్వారంటైన్ కేంద్రాలు నడుస్తున్నంత వరకూ ఈ విధానం అమల్లో ఉంటుందని తెలుస్తోంది. ఇది పూర్తిగా కుటుంబ నియంత్రణ చర్య అని కోవిడ్‌-19తో ఎటువంటి సంబంధం లేదని స్టేట్‌ హెల్త్‌ సొసైటీ ఫ్యామిలీ ప్లానింగ్‌ అధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్య అధికారిగా జనాభాను అదుపులో ఉంచడం తమ బాధ్యత అన్నారు. 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై

తాజా లెక్కల ప్రకారం బీహార్‌కు తొరిగొచ్చిన వలస కార్మికుల్లో దాదాపు 9 లక్షల మంది క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. మరో 5.3 లక్షల మంది జిల్లా, మండల స్థాయి క్వారంటైన్ కేంద్రాల్లో ఉన్నారు. జూన్ 15 నాటి వీరి క్వారంటైన్ కూడా పూర్తి అయిన తరువాత అధికారులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వం కేంద్రాలు మూసివేస్తారని సమాచారం.అప్పటికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాష్ర్టానికి చేరుకునే కూలీలు చేరుకుంటారని అధికారులు పేర్కొన్నారు.

బీహార్ లో ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం 3,926 కేసులు నిర్థారించబడ్డాయి. 24 మంది కరోనాతో మరణించారు. 2002 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 111 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1900 మంది రికవరీ అయి డిశ్చార్జ్ అయ్యారు.