Lockdown 5.0: ఇకపై హెయిర్‌కట్‌ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు,మొబైల్ నంబర్ తప్పనిసరి, చెన్నైలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు విధించిన తమిళనాడు సర్కారు
Need haircut in Chennai? Show your Aadhaar card Tamil Nadu Govt New Rules for the salons (Photo-PTI)

Chennai, June 2: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు (Tamil Nadu Coronavirus) రొజు రోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అక్కడ రాజధాని చెన్నైలో (Chennai Covid-19) ఈ కేసులు ఆగడం లేదు. అక్కడ వైరస్‌ కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా కేసుల సంఖ్య మాత్రం అదుపులోకి రావడంలో లేదు. అయితే కేంద్రం కంటైన్‌మెంట్‌ జోన్లో లాక్‌డౌన్‌ను (Lockdown 5.0) జూన్‌ 30 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ సారి పలు దుకాణాలకు ఆంక్షల నుంచి సడలింపులు సైతం ఇచ్చింది. వీటిల్లో సెలూన్లు, స్పాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది. ఈ నేపథ్యంలో తమిళనాడు సర్కారు (Tamil Nadu government) కూడా పలు నిబంధనలతో కేంద్రం ఇచ్చిన సడలింపులను అమల్లోకి తెచ్చింది.

ఈ నిబంధనల ప్రకారం ఇకపై చెన్నైలో హెయిర్‌కట్‌‌ చేయించుకోవాలి అనుకునే వారు మాస్క్‌తో పాటు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ వెంట తెచ్చుకోవాలని ప్రభుత్వం నిబంధన విధించింది. దీనిపై వివరణ కూడా ఇచ్చింది. సెలూన్ల ద్వారా ఎవరికైనా వైరస్‌ వ్యాప్తి చెందితే ఆ షాపుకు వచ్చిన వారిని గుర్తించడం అధికారులకు సులభం అవుతుందని వివరించింది. ఆధార్‌ వివరాల ద్వారా వ్యక్తులను వెంటనే గుర్తించి.. వైరస్‌ వ్యాప్తిని అరికట్టవచ్చని ప్రభుత్వ తెలిపింది. 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై

కొవిడ్ -19 ప్రబలుతున్న నేపథ్యంలో హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్లు, స్పాలకు వచ్చే ఖాతాదారుల పేర్లు, వారి చిరునామాలు, ఫోన్ నంబర్లు, ఆధార్ నంబర్లను తీసుకోవాలని సర్కారు ఆదేశించింది. గ్రేటర్ చెన్నై మున్సిపల్ కార్పొరేషన్ తోపాటు అన్ని జిల్లాల కలెక్టర్లు, కమిషనర్లకు ఏడు పేజీల సూచనలతో కూడిన ఆదేశాలను సర్కారు విడుదల చేసింది. హెయిర్ కటింగ్ సెలూన్లు, బ్యూటీపార్లర్ల ప్రవేశద్వారాల్లో హ్యాండ్ శానిటైజరు, సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలని సర్కారు సూచించింది. శ్రీవారి దర్శనానికి ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, జూన్ 8న తెరుచుకోనున్న శ్రీవారి ఆలయ తలుపులు, ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ అధికారులు

ఖాతాదారులు అప్పాయింట్ మెంట్ తీసుకొని భౌతిక దూరం పాటిస్తూ హెయిర్ కటింగులు చేయించుకోవాలని సర్కారు సూచించింది. హెయిర్ కటింగు సెలూన్లలో ఏసీలు, ఎయిర్ కూలర్లు వాడరాదని, కిటికీలు తెరచి ఉంచాలని, వాడిన బ్లేడ్లను మళ్లీ వాడరాదని, హెడ్ బాండ్స్, టవల్స్ ఒకరికి మాత్రమే వాడాలని సర్కారు ఆదేశించింది. హెయిర్ కటింగ్ చేసే కార్మికులు చేతులకు హ్యాండ్ గ్లోజులు , ఫేస్ మాస్క్ లు ధరించాలని సర్కారు కోరింది. హెయిర్ కటింగుకు వచ్చే వారికి దగ్గు, జలుబు, జ్వరం ఉంటే వారిని లోపలకు అనుమతించవద్దని సర్కారు తన మార్గదర్శకాల్లో ఆదేశించింది.

అలాగే ప్రభుత్వ ఆదేశాలను పాటించిన షాపులపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ఉత్తర్వులో పేర్కొంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 23వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన విషయం తెలిసిందే. కరోనా కేసులు అత్యధికంగా నమోదైన మహారాష్ట్ర తరువాత తమిళనాడు రెండో స్థానంలో ఉంది.