Tirumala, June 2: కోవిడ్ 19 లాక్ డౌన్ కారణంగా రెండునెలలకు పైగా నిలిచిపోయిన తిరుమల శ్రీవారి దర్శనాలు (Tirumala Sri vari Darshan) తిరిగి ప్రారంభించేందుకు ఏపీ ప్రభుత్వం (AP Govt) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కరోనావైరస్ (Coronavirus) వ్యాప్తి నేపథ్యంలో ఆరడుగుల భౌతిక దూరం పాటిస్తూ భక్తులకు దర్శనం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే టీటీడీ ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్ రన్ నడిపేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు టీటీడీ ఈవో రాసిన లేఖకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. 2016 టీటీడీ బోర్టు నిర్ణయాన్ని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం, స్వామీజీలు,ధార్మిక సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచన
దర్శనానికి అనుమతినిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్‌వీ ప్రసాద్ మంగళవారం ఉత్వర్వులు జారీచేశారు. లాక్‌డౌన్ నిబంధనలను అనుసరిస్తూ శ్రీవారి దర్శనాన్ని కొనసాగించవచ్చని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని టీటీడీ (Tirumala Tirupati Devasthanams) అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా వైరస్ వ్యాప్తి నేపథ్యలో మార్చి 20 శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జూన్ 8వ తేదీన శ్రీవారి ఆలయ తలుపులు తెరచుకోనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లు దశలవారీగా ఇప్పటికే పూర్తి చేశారు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ 5 అమలులోకి వచ్చిన నేపథ్యంలో పలు సడలింపులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. వాటిలో ఆలయాలు, ప్రార్ధనా మందిరాలు తెరవడం ఒకటి. ప్రభుత్వ సూచనలు, ఆదేశాల మేరకు జూన్ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రాకను పునరుద్ధరించడానికి టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. టీటీడీ ఆస్తులను అమ్మే ప్రసక్తే లేదు, ముగిసిన తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి
జూన్ 8 నుంచి ఆలయాల్లో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని టీడీడీ జేఈవో ధర్మారెడ్డి ప్రభుత్వానికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ట్రయల్ పద్ధతిలో దర్శనాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం ఇచ్చిన అనుమతితో టీటీడీ ముందుగా ఉద్యోగులు, స్ధానికులతో వారం రోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ వారం రోజులు ఇలా నిర్వహించాక తగు జాగ్రత్తలతో ఈ నెల 8 నుంచి సాధారణ, వీఐపీ దర్శనాలకు అనుమతి ఇచ్చే అవకాశముంది.