Amaravati, May 28: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి (Tirumala Tirupati Devasthanam Board) సమావేశం ముగిసింది.ఈ సమావేశంలో టీటీడీ పాలక మండలి (TTD Board) కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానంగా టీటీడీ భూములు (TTD Properties) విక్రయించొద్దని నిర్ణయం తీసుకుంది. అలాగే టీటీడీ ఆస్తులు, కానుకలు విక్రయించకూడదని నిర్ణయించింది. ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుణంగా నిర్ణయం తీసుకున్నామన్నారు. టీటీడీ భూములు, ఆస్తులు ఎట్టి పరిస్థితిల్లో అమ్మేదిలేదని స్పష్టం చేశారు. టీటీడీ ధర్మకర్తల మండలి గురువారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో సమావేశమైంది. 2016 టీటీడీ బోర్టు నిర్ణయాన్ని నిలిపివేసిన ఏపీ ప్రభుత్వం, స్వామీజీలు,ధార్మిక సంస్థలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచన
నిరుపయోగ ఆస్తులు అన్యాక్రాంతమవకుండా ఉండేందుకు కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పాలకమండలి సభ్యులు, పీఠాధిపతులు, భక్తులకు చోటు కల్పించనుంది. టీటీడీ ఆస్తులు విక్రయిస్తున్నారన్న ప్రచారంపై విచారణ జరపాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (TTD Chairman Y.V. Subba Reddy) డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. పాలకమండలిపై మరోసారి ఆరోపణలు రాకుండా చూడాలన్నారు. టీటీడీ వార్షిక బడ్జెట్ రూ.3309 కోట్లు, గతేడాది కంటే రూ.66 కోట్లు అధికం, ఆమోదం తెలిపిన పాలక మండలి
అతిథి గృహాల కేటాయింపులో పారదర్శకత ఉండాలని బోర్డు తీర్మానించిందన్నారు. పాత అతిధి గృహాలు పునర్నిర్మించేందుకు మాత్రమే అనుమతి ఉందన్నారు. డొనేషన్ విధానంలో అతిథి గృహాలను కేటాయిస్తామని, దీనికి సంబంధించి మార్గదర్శకాలు రూపొందించాలని టీటీడీ ఈవోని ఆదేశించామని చెప్పారు. తిరుమలలో పాత కాటేజీల కేటాయింపుపై అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలోని చిన్నపిల్లల ఆస్పత్రిని తక్షణమే ప్రారంభిస్తామన్నారు. విద్యా వ్యవస్థలో ఆన్‌లైన్ అడ్మిషన్లకు చర్యలు తీసుకోవాలి. లాక్‌డౌన్ నిబంధనలు తొలగించిన తర్వాత శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తామని చెప్పారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో సుమారు 60 రోజులుగా శ్రీవారి దర్శనం నిలిచిపోయిన తరుణంలో తొలిసారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టీటీడీ బోర్డు భేటీ అయింది. బోర్డు చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తిరుపతి నుంచి ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, ప్రత్యేక ఆహ్వానితులు కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. మిగిలిన సభ్యులు వారివారి స్వస్థలం నుంచి పాల్గొన్నారు. టీటీడీ చరిత్రలో మొట్టమొదటి సారిగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాలకమండలి సమావేశం నిర్వహించింది.