Bihar: అర్థరాత్రి రైతుల ఇళ్లపై పోలీసులు దాడి, కోపంతో పోలీసు వాహనాలను తగులబెట్టిన రైతులు, బీహార్ బక్సర్ జిల్లాలో హింసాత్మకంగా మారిన రైతుల నిరసన, వీడియోలు వైరల్

గత అర్ధరాత్రి రైతుల ఇళ్లపై పోలీసులు దాడి చేసిన తర్వాత (Farmers Attack Cops) గ్రామస్థులు పవర్ ప్లాంట్‌పై దాడి చేయడంతో పాటు పోలీసు వాహనాలను కూడా తగలబెట్టడంతో బుధవారం బక్సర్స్ చౌసా ప్రాంతంలో రైతుల నిరసన హింసాత్మకంగా (Protest Turns Violent in Buxar) మారింది.

Picture from violence in Buxar.(Photo/ANI))

Buxar, January 11:  గత అర్ధరాత్రి రైతుల ఇళ్లపై పోలీసులు దాడి చేసిన తర్వాత (Farmers Attack Cops)  గ్రామస్థులు పవర్ ప్లాంట్‌పై దాడి చేయడంతో పాటు పోలీసు వాహనాలను కూడా తగలబెట్టడంతో బుధవారం బక్సర్స్ చౌసా ప్రాంతంలో రైతుల నిరసన హింసాత్మకంగా (Protest Turns Violent in Buxar) మారింది. ఆందోళన చేస్తున్న రైతుల ఇళ్లపై బక్సర్ పోలీసులు అర్ధరాత్రి వారు నిద్రిస్తున్న సమయంలో దాడి (Midnight Raid by Police) చేశారని, మహిళలు సహా డజన్ల కొద్దీ గ్రామస్తులు గాయపడ్డారని వార్తలు వస్తున్నాయి. పోలీసుల క్రూరత్వం సీసీటీవీ ఫుటేజీల్లో రికార్డైంది.

అర్థరాత్రి సమయంలో ఇంటిలో నిద్రిస్తున్న రైతులపై పోలీసులు దాడి, బక్సర్ రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగిన నిరసనకారులు, బీహార్ బక్సర్‌ జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు

జిల్లాలోని చౌసా బ్లాక్‌లో ప్రభుత్వ ఆధీనంలో నడిచే విద్యుత్‌ కంపెనీ తమ భూమిని సేకరిస్తున్న తమ భూములకు మంచి రేట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రెండు నెలలుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. ఈరోజు ఆగ్రహించిన గ్రామస్తులు కర్రలు, రాడ్లతో పోలీసులు, పవర్ ప్లాంట్‌పై దాడి చేశారు.

Here's Protest Video

పోలీసు వాహనాలను ధ్వంసం చేసి తగులబెట్టారు. పవర్ ప్లాంట్ గేటుకు కూడా నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి జనాన్ని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఆ ప్రాంతమంతా పోలీసు క్యాంపుగా మారిపోయింది. ఇరువైపులా రాళ్ల దాడి జరిగింది.

Protest in Bihar

పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే అదుపు చేస్తామని బక్సర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మనీష్ కుమార్ తెలిపారు. ఈమేరకు మంగళవారం రైతులు ప్లాంటు ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. ఆ తర్వాత ముఫ్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బనార్‌పూర్ గ్రామంలో గత రాత్రి పోలీసులు వారి ఇళ్లలోకి ప్రవేశించి వారిని కొట్టారు.