Bihar Shocker: తోటి విద్యార్థులే కామాంధులయ్యారు, కోచింగ్ సెంటర్‌లో మైనర్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన 5 మంది విద్యార్థులు

ఆ ఐదుగురు అదే కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులు.

Representative image

Patna, May 5: దేశంలో అత్యాచారాలు ఆగడం లేదు. కామాంధుల్లో మార్పు రావడం లేదు. ఎన్ని చట్టాలు చేసినప్పటికీ మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా బీహార్ రాష్ట్రంలో (Bihar’s Jamui District) దారుణ ఘటన చోటు చేసుకుంది. బీహార్‌లోని జాముయ్‌లో ఒక మైనర్ కోచింగ్‌ సెంటర్‌ నుంచి తిరిగి వస్తుండగా ( returning from coaching classes) ఆమె పై ఐదుగురు విద్యార్థులు సాముహిక అత్యాచారానికి (5 students gang-rape Minor girl) పాల్పడ్డారు. ఆ ఐదుగురు అదే కోచింగ్‌ సెంటర్‌ విద్యార్థులు. ఐతే ఆ బాలిక గతంలో తనతో ఒక అబ్బాయి అసభ్యంగా ప్రవర్తించాడంటూ కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆగ్రహం చెందిన ఆ విద్యార్థి తన స్నేహితులతో కలిసి ఆమె పై సాముహిక అత్యాచారానికి పాల్పడ్డాడు.

అయితే ఆ మైనర్‌ తల్లిదండ్రులు కోచింగ్‌ నిర్వాహకులు ఇకపై మీ అమ్మాయికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇ‍వ్వడంతోనే కోచింగ్‌ సెంటర్‌ పంపామని పోలీసులకు చెబుతుండటం గమనార్హం. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బాలికను చికిత్స మరియు వైద్య విశ్లేషణ కోసం ఆసుపత్రిలో చేర్చారు. వైద్య నివేదికల అనంతరం సామూహిక అత్యాచారం జరిగినట్లు నిర్ధారిస్తామని పోలీసులు తెలిపారు.

యూపీలో దారుణం, 13 ఏళ్ళ బాలికను పోలీస్ స్టేషన్‌లోనే రేప్ చేసిన పోలీసాఫిసర్, గ్యాంగ్ రేప్ జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళితే బాలికపై అత్యాచారం చేసిన స్టేషన్ SHO

మరో ఘటనలో, ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో 13 ఏళ్ల మైనర్ బాలికపై పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌తో సహా ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం పాలీ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైంది, అక్కడ మైనర్‌ను నలుగురు యువకులు ప్రలోభపెట్టి ఏప్రిల్ 22 న భోపాల్‌కు తీసుకెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఎలాగోలా తప్పించుకుని ఆమె ఇంటికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది, అక్కడ స్టేషన్ ఇన్‌ఛార్జ్ యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ చైల్డ్‌లైన్ సంక్షేమ కమిటీకి అప్పగించారు. యువతిని చైల్డ్‌లైన్ అధికారులు ప్రశ్నించగా, బాధితురాలు మొత్తం సంఘటనను వివరించింది, ఆ తర్వాత చైల్డ్‌లైన్ సంక్షేమ కమిటీ నేరం గురించి లలిత్‌పూర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి చేరుకుంది. దీంతో ఎస్పీ వెంటనే ఎస్‌హెచ్‌ఓ తిలకధారి సరోజతో సహా ఆరుగురిపై సామూహిక అత్యాచారం కేసు నమోదు చేశారు.