Bihar: నన్ను అసహజ సెక్స్ కోసం రోజూ వేధిస్తున్నాడు, ఐఏఎస్ అధికారి ఝాపై ఫిర్యాదు చేసిన భార్య, ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు
ఝా తెలంగాణ కేడర్‌కు చెందిన IAS అధికారి. వాస్తవానికి బీహార్‌లోని దర్భంగా జిల్లా నివాసి
Patna, June 12: గృహహింస, వరకట్న వేధింపులు, అసహజ శృంగారం వంటి ఆరోపణలపై 2014 బ్యాచ్ ఐఏఎస్ అధికారి ఝాపై కోర్బా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. ఝా తెలంగాణ కేడర్‌కు చెందిన IAS అధికారి. వాస్తవానికి బీహార్‌లోని దర్భంగా జిల్లా నివాసి.ఝాపై అతని భార్య ఆరోపణలు చేసింది.
ఈ విషయంలో కోర్బా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. అయితే, పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆమె ఆరోపించింది. తరువాత తన న్యాయవాది శివనారాయణ్ సోనీ ద్వారా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.ఈ వ్యవహారంపై కోర్బా సివిల్ లైన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఈ జంట 2021 సంవత్సరంలో దర్భంగా బీహార్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత, తన భర్త కట్నం కోసం నిరంతరం వేధించాడని ఝా భార్య తెలిపింది. ఝా గృహ హింస, తనతో అసహజ సెక్స్‌లో ఉన్నారని కూడా ఆమె ఆరోపించింది. పెళ్లి సమయంలో భారీ మొత్తంలో నగదు, బంగారు, వెండి నగలు కట్నంగా ఇవ్వాలని ఝా డిమాండ్ చేశారని ఐఏఎస్ అధికారి భార్య తన ఫిర్యాదులో పేర్కొంది.
ఫ్యాషన్ షోలో ర్యాంప్ వాక్ చేస్తుండగా మీద పడిన స్థంభం, అక్కడికక్కడే మృతి చెందిన నోయిడా మోడల్
తన భర్త బ్రాండెడ్ బట్టలు, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, టీవీ, ఫర్నిచర్ కూడా కట్నంగా తీసుకున్నాడని, దీని కోసం తన కుటుంబం వివాహానికి కోటి రూపాయలకు పైగా ఖర్చు చేయాల్సి వచ్చిందని ఆమె ఆరోపించారు. సీనియర్ ఐఏఎస్ అధికారి ఉదిత్ ప్రకాశ్ రాయ్ తన వార్షిక పనితీరు మదింపు నివేదిక (ఏపీఏఆర్)పై రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఇద్దరు ప్రధాన కార్యదర్శుల సంతకాలను ఫోర్జరీ చేశారనే ఆరోపణలపై కేసు నమోదు చేసిన రెండు రోజుల తర్వాత ఝాపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.