Onion Shortage In Bihar: తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయల అమ్మకం, దుండుగుల దాడి చేస్తారనే భయంతోనే అంటున్న విక్రేతలు, ప్రభుత్వం తమకు భద్రత ఏర్పాటు చేయలేదని ఆగ్రహం, ఉల్లి కోసం భారీగా క్యూ కట్టిన ప్రజలు

ఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు ఇవే ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆనియన్స్ ధరలు(Onion Price) ఆశానంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

Bihar State Cooperative Market Officials Wear Helmets For Safety As They Sell Onions (Photo-ANI)

Patna, November 30: ఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు ఇవే ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆనియన్స్ ధరలు(Onion Price) ఆశానంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) అయితే కిలో రూ.100 రూ. 120 వరకూ ఉంటున్నాయి. ఇక ఉత్తర భారతదేశంలో అయితే ఉల్లి ధరలు వంద నుంచి ఐదు వందల రూపాయలు ఉంటున్నాయి.

దీంతో అక్కడి ప్రజలు ఉల్లిగడ్డలు కొనాలంటేనే బెంబేలేత్తిపోతున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం (Bihar government) ప్రజలకు ఉల్లి ధరల నుంచి కాస్త ఉపశమనం కల్పించేందుకు యోచించింది.

బీహార్ స్టేట్ కోఆపరేటివ్ మార్కెటింగ్ యూనియన్ లిమిటెడ్(Bihar State Cooperative Marketing Union Limited) ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉల్లిపాయ కౌంటర్లను తెరిచారు. ఈ కౌంటర్ల వద్ద గృహిణులు బారులు తీరారు. కిలో ఉల్లిపాయలను రూ. 35కు అమ్ముతున్నారు. అయితే కొందరు దుండగులు ఉల్లిపాయలను విక్రయించే వారిపై రాళ్లు విసిరి దాడులు చేస్తున్నారు.

ANI Tweet

వారి నుంచి రక్షణ పొందేందుకు తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయలను విక్రయిస్తున్నామని(Wear Helmets For Safety As They Sell Onions) అధికారులు తెలిపారు.తమకు ప్రభుత్వం ఎలాంటి రక్షణ కల్పించలేదు.. అందుకే ఈ మార్గాన్ని ఎంచుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.

జనాలు భారీ సంఖ్యలు వస్తున్న ప్రభుత్వం తమను భద్రత ఏర్పాటు చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనాలను చూసి అధికారులు భయంతో తమపై ఎక్కడ దాడి చేస్తారోనని హెల్మెట్లు పెట్టుకొని ఉల్లిగడ్డను విక్రయిస్తున్నారు.ప్రభుత్వం ఇప్పటికైనా తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

కాగా ఓ వ్యక్తికి రెండు కేజీల ఉల్లిపాయలను మాత్రమే అందిస్తున్నారు. అయితే వివాహ కార్డు చూపించిన వారికి మాత్రం 25 కిలోల ఉల్లిపాయలను ఒకే రేటుతో పొందవచ్చు.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now