Bihar Shocker: హోంవర్క్ చేయలేదని ఎల్‌కేజీ విద్యార్ధిని చితకబాదిన టీచర్, దెబ్బలు తట్టుకోలేక మృతిచెందిన 7 ఏళ్ల బాలుడు, బీహార్‌లో విషాదకర ఘటన

ఆ దెబ్బలను తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌ (Bihar)లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Representational Image | (Photo Credits: IANS)

Patna, March 25: హోమ్‌వర్క్‌ చేయలేదని ఓ ఉపాధ్యాయుడు (Teacher) ఎల్‌కేజీ చదువుతున్న ఏడేళ్ల విద్యార్థిపై తన ప్రతాపాన్ని చూపించాడు. ఆ దెబ్బలను తట్టుకోలేని చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. బిహార్‌ (Bihar)లోని ఓ ప్రైవేటు పాఠశాలలో చోటుచేసుకున్న ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిహార్‌లోని సహర్సా ప్రాంతానికి చెందిన ఏడేళ్ల ఆదిత్య యాదవ్‌ స్థానికంగా ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఎల్‌కేజీ చదువుతూ అక్కడే వసతి గృహంలో ఉంటున్నాడు. ఇచ్చిన హోమ్‌వర్క్‌ చేయకపోవటం, చెప్పిన పాఠాలు వినటం లేదనే కారణంతో టీచర్‌ సుజిత్‌ కుమార్‌ గత బుధవారం చిన్నారిని కర్రతో తీవ్రంగా కొట్టారు. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. మరుసటి రోజు ఉదయం ఆదిత్య హాస్టల్‌లో మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండటం చూసిన తోటి విద్యార్థులు సుజిత్‌కు తెలియజేశారు. దీంతో అతడిని ఆసుపత్రిలో చేర్చారు. అయితే అప్పటికే ఆ చిన్నారి మృతిచెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. దీంతో స్కూల్‌ యాజమాన్యం బాలుడి కుటుంబానికి సమాచారమిచ్చింది.

RBI: ఈ బ్యాంకుపై ఆర్బీఐ రూ.30 లక్షల జరిమానా విధించింది, అసలు విషయం ఏంటో తెలుసుకోండి

పాఠాలు గుర్తుపెట్టుకోవటం లేదనే కారణంతో వరుసగా రెండు రోజులు ఆదిత్యను ఉపాధ్యాయుడు కొట్టారని దాంతో శరీరంపై వాపు వచ్చినట్లు అదే స్కూల్లో చదువుతున్న మరో బాలుడు తెలిపాడు. ‘హోలీ అనంతరం మార్చి 14న నా కుమారుడు హాస్టల్‌కు వచ్చాడు. ఆదిత్య హాస్టల్‌ నుంచి స్కూల్‌కి చేరుకోకముందే స్పృహ కోల్పోయాడని.. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపల నా బిడ్డ మరణించాడని సుజిత్‌ సమాచారం అందించారు.

Hyderabad Shocker: తార్నాకలో దారుణం, అనారోగ్యంతో ఉన్న పిల్లలను చూడలేక సైనేడ్‌ ఇచ్చి చంపిన తల్లిదండ్రులు, అనంతరం విషం తాగి ఇద్దరూ ఆత్మహత్య

కానీ, స్కూల్లో తీవ్రంగా కొట్టడం వల్లే నా కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు’ అని బాలుడి తండ్రి ప్రకాశ్‌ యాదవ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సుజిత్‌ పరారీలో ఉన్నాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.