BJP Leader CM Ramesh: వైరల్ అవుతోన్న బీజేపీ నేత డ్యాన్స్, అత్తారింటికి దారేది సినిమాలో పాటకు అదిరిపోయే స్టెప్పులేసిన సీఎం రమేష్, ఘనంగా కొడుకు రిత్విక్ నిశ్చితార్థపు వేడుక, ఏపీ నుంచి ఎవరు వెళ్లారనేది సస్పెన్స్
పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి(industrialist Raja Talururi) కుమార్తె పూజా(Pooja)తో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ (CM Ramesh) ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.
Dubai,November 25: రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత సీఎం రమేష్ కుమారుడు రిత్విక్ (Ritwik son of Rajya Sabha CM Ramesh) నిశ్చితార్దం దుబాయ్‌లో వైభవంగా జరిగింది. పారిశ్రామిక వేత్త రాజా తాళ్లూరి(industrialist Raja Talururi) కుమార్తె పూజా(Pooja)తో నిశ్చితార్ధం ఖరారైన సమయం నుండి సీఎం రమేష్ (CM Ramesh) ఈ వేడుక నిర్వహణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. దీనిని దుబాయ్ లో నిర్వహణ కోసం నెల రోజులుగా ఏర్పాట్లు మొదలు పెట్టారు.
అందులో భాగంగా..దుబాయ్(Dubai)లోని వాల్డాఫ్ర్ అస్టోరియా, రసాల్ ఖైమా(Waldorf Astoria and Rasal Khaimah)లో వేదిక ఖరారు చేసారు. ఇందు కోసం సీఎం రమేష్ పార్లమెంట్ లోని ఎంపీ(the members of Parliament)లతో పాటుగా అతిరధ మహారధులను ఆహ్వానించారు. వివాహానికి ఏ మాత్రం తీసిపోకుండా నిశ్చితార్ధం నిర్వహించారు. ఆ సమయంలో సీఎం రమేష్ జోష్ గా కనిపించారు. పాటలకు స్టెప్పులతో అదరగొట్టారు.
BJP MP CM Ramesh Dance
దుబాయ్‌లో రూ.25 కోట్ల ఖర్చుతో అతిరథమహారథుల మధ్య ఈ కార్యక్రమం జరిగింది. కాగా అతిథుల కోసం సీఎం రమేష్ 15 ప్రత్యేక విమానాలు బుక్ చేయడం విశేషం. ఏపీలోని అన్నీ పార్టీల నాయకులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు రాజకీయ, సినీ స్టార్స్ ఈ వేడకకు హాజరయ్యారు. దాదాపు 75 మంది ఎంపీలను సీఎం రమేశ్ ఈ కార్యక్రమానికి ఆహ్వానించినట్టు సమాచారం.
కుమారుడి నిశ్చితార్థం సందర్భంగా సీఎం రమేశ్ దంపతులు వేసిన స్టెప్పులు ఇప్పుడు వైరల్‌గా మారాయి. పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది చిత్రంలోని అమ్మో..బాపుగారి బొమ్మో..సాంగ్‌కి ఈ కపుల్ అదిరిపోయే లెవల్లో డ్యాన్స్ చేశారు. దీంతో అక్కడ ఉన్నవాళ్లంతా చప్పట్లతో హోరెత్తించారు.
సీఎం రమేష్‌కు వియ్యంకుడు అవుతున్న రాజా తాళ్లూరి సైతం ప్రముఖ పారిశ్రామిక వేత్త. అమెరికా కేంద్రంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే, ఎంపీలు పలువురు హాజరైనట్లుగా తెలుస్తున్నా..ఏపీకి చెందిన వారిలో ఎవరెవ్వరు హాజరయ్యారనే విషయంపై ఇంకా ఎటువంటి సమాచారం లేదు.