Bandi Sanjay Oath: కేంద్ర మంత్రిగా ప్ర‌మాణస్వీకారం చేసిన బండి సంజ‌య్, ద‌ద్దరిల్లిన క‌ర్త‌వ్య‌ప‌థ్ (వీడియో ఇదుగోండి)

మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వంలో...ఆయ‌నకు కేబినెట్ లో చోటు ల‌భించింది. చిన్న‌నాటి నుంచే స్వయం సేవక్ గా ప‌ని చేసిన ఆయ‌న‌..రెండు సార్లు ఎంపీగా గెలిచారు. గ‌తంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు కల్పించారు.

Bandi Sanjay Oath (PIC@ ANI)

New Delhi, June 09: క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ (Bandi Sanjay) కేంద్ర మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. మూడోసారి అధికారంలోకి వ‌చ్చిన ఎన్డీయే ప్ర‌భుత్వంలో...ఆయ‌నకు కేబినెట్ లో చోటు ల‌భించింది. చిన్న‌నాటి నుంచే స్వయం సేవక్ గా ప‌ని చేసిన ఆయ‌న‌..రెండు సార్లు ఎంపీగా గెలిచారు.  గ‌తంలో తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడిగా ప‌నిచేసిన ఆయ‌న‌కు బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గంలో చోటు కల్పించారు. ఇప్పుడు ఏకంగా కేబినెట్ లోకి తీసుకున్నారు. దీంతో క‌రీంన‌గ‌ర్ వ్యాప్తంగా సంబురాలు మిన్నంటాయి.

 

కేంద్ర మంత్రులుగా వ‌రుస‌గా రాజ్‌నాథ్ సింగ్‌, అమిత్ షా, నితిన్ గ‌డ్క‌రీ, జేపీ న‌డ్డా, శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌, నిర్మ‌లా సీతారామ‌న్‌,  జైశంక‌ర్, కిష‌న్ రెడ్డి, రామ్మోహ‌న్ నాయుడు, అశ్వ‌నీ వైష్ణ‌వ్, జిత‌న్ రామ్ మాంజీ, ప‌లువురు  ప్ర‌మాణ స్వీకారం చేశారు. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఏర్పాటైన ఈ కార్య‌క్ర‌మానికి పెద్ద‌సంఖ్య‌లో బీజేపీ అగ్ర‌నేత‌లు, సీనియ‌ర్ నాయకులు, ఎన్డీయే భాగ‌స్వామ్య ప‌క్షాల నేత‌లు హాజ‌రయ్యారు.