Kishan Reddy Oath: రెండోసారి కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కిషన్ రెడ్డి, శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, ఇతర మంత్రులు (వీడియో ఇదుగోండి)
ఆయన గతంలో టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సారి కూడా ఆయనకు కేబినెట్ హోదా దక్కింది.
New Delhi, June 09: రాష్ట్రపతి భవన్‌లో నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మోదీచే ప్రమాణ స్వీకారం చేయించారు. అటు సికింద్రాబాద్ ఎంపీగా ఉన్న కిషన్ రెడ్డికి (Gangapuram Kishan Reddy) మరోసారి మోదీ కేబినెట్ లో (Modi Cabinet) చోటు లభించింది. ఆయన గతంలో టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ సారి కూడా ఆయనకు కేబినెట్ హోదా దక్కింది.
కేంద్ర మంత్రులుగా వరుసగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, జైశంకర్ పలువురు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటైన ఈ కార్యక్రమానికి పెద్దసంఖ్యలో బీజేపీ అగ్రనేతలు, సీనియర్ నాయకులు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల నేతలు హాజరయ్యారు.