BJP MLA Arun Narang: రైతుల ఆగ్రహం, కొత్త చట్టాలకు మద్దతుగా మాట్లాడిన ఎమ్మెల్యేను గుడ్డలు ఊడదీసి తరిమికొట్టిన రైతులు, ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌‌పై దాడిని ఖండించిన సీఎం అమరీందర్ సింగ్, బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశాలు

ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

BJP MLA Arun Narang (Photo-ANI)

Muktsar, Mar 28: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల రద్దును కోరుతూ గత కొన్ని నెలల నుంచి రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న సంగతి విదితమే. అయితే దీనిపై కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పంజాబ్ లోని భారతీయ జనతాపార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ (BJP MLA Arun Narang) మాట్లాడారు.

దీంతో రైతులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు విచక్షణా రహితంగా దాడి (BJP MLA Restrained by Protesters in Muktsar) చేశారు. ఎమ్మెల్యేను పరుగులు పెట్టించారు. అక్కడ పోలీసులు ఉన్నా కూడా రైతులు వినకుండా ఎమ్మెల్యేను చితకబాదారు. తమకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు.

కాగా పంజాబ్‌లోని ముక్తాసార్‌ జిల్లా మాలోట్‌లో బీజేపీ ఎమ్మెల్యే అరుణ్‌ నారంగ్‌ పర్యటించారు. వ్యవసాయ చట్టాలకు మద్దతుగా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న రైతు సంఘాల నాయకులు కార్యాలయానికి చేరుకున్నారు. కార్యాలయాన్ని ముట్టడించి కేంద్ర ప్రభుత్వం, ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన దుస్తులను చించేశారు.ఆయనపై నల్ల ఇంకు చల్లారు.

Here's ANI Update

అనంతరం పెద్ద ఎత్తున కార్యాలయంలోకి వెళ్లి ఎమ్మెల్యేను బయటకు తీసుకొచ్చారు. రైతులను చూసి ఎమ్మెల్యే నారంగ్‌ అక్కడ ఉన్న ఓ దుకాణంలోకి వెళ్లారు. పోలీసులు ఆయనకు రక్షణ కల్పించేందుకు (P Hurt While Trying to Rescue Him) పరుగెత్తారు. వారి వెంట రైతులు కూడా వెళ్లారు.

కదిలేది లేదు..రోడ్ల పైనే వ్యవసాయం చేస్తాం

ఈ దాడి ఘటనను సీఎం అమరీందర్‌సింగ్‌ ఖండించారు. బాధ్యులపై కఠిన చర్యలకు ఆదేశించారు. ఎమ్మెల్యేపై దాడి ఘటనను సంయుక్త కిసాన్‌మోర్చా ఖండించింది. ఇలాంటి ధోరణిని తాము ప్రోత్సహించబోమని, రైతులు శాంతియుతంగా నిరసన తెలుపాలని సూచించింది.