BMW G 310 RR: రూ. 2.85 లక్షల ధరతో బీఎండబ్ల్యూ నుంచి కొత్త స్టోర్ట్స్ బైక్, BMW G 310 RR పేరుతో విడుదల చేసిన కంపెనీ, జీ 310 ఆర్‌ఆర్ బైక్ ఫీచర్లు ఇవే..
దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది.
బీఎండబ్ల్యూ తన తొలి జీ 310 ఆర్‌ఆర్ పేరుతో ఈ సూపర్ బైక్స్ మోడళ్లను విడుదల చేసింది. దీని స్టాండర్డ్ వేరియంట్ ధర రూ. 2.85 లక్షలు (ఎక్స్-షోరూమ్) స్టైల్ స్పోర్ట్ వేరియంట్ ధర రూ. 2.99 లక్షలుగా నిర్ణయించింది. బీఎండబ్ల్యూ జీ310 ఆర్, జీఎస్ అడ్వెంచర్ టూరర్ తర్వాత 310 సిరీస్‌లో బవేరియన్ బ్రాండ్‌కు సంబంధించి మూడో మోడల్ ఇది. ఇప్పటికే బుకింగ్‌లను ప్రారంభించిన కంపెనీ నెలకు రూ. 3,999ల ఈజీ ఈఎంఐ ఆప్షన్‌ను కూడా తన అధికారిక ట్విటర్ హ్యాండిల్ ద్వారా ప్రకటించింది. మారుతీ సుజుకీ సంచలన నిర్ణయం, వచ్చే పదేళ్లలో పెట్రోల్ కార్లు ఉండవ్, ఎలక్ట్రిక్ వెహికిల్స్ తయారీపై దృష్టిసారించిన మారుతీ, ఎకో ఫ్రెండ్లీకి పెద్దపీట అంటూ ప్రకటన
బైక్ ఫీచర్ల విషయానికి వస్తే ముందు భాగంలో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను వెనుక టెయిల్-ల్యాంప్‌లలోని బుల్ హార్న్ స్టైల్ LED ఎలిమెంట్స్‌తో పాటు, రీడిజైన్ ఆపరేటింగ్ సిస్టమ్ బ్లూటూత్ కనెక్టివిటీ, 5-అంగుళాల TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, BI-LED ట్విన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, ప్రధానంగా ఉన్నాయి.
Here's BMW Tweet
ఈ బైక్‌లో 313 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజన్‌ను అమర్చింది. ఇది 9,700 rpm వద్ద 34 bhpని, 7,700 rpm వద్ద 27 ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్ అందించింది. ఇందులో రైడ్ , డ్యూయల్ ఛానల్ ABS లాంటి ఫీచర్లున్నాయి. మార్కెట్లో టీవీఎస్ అపాచీ ఆర్‌ఆర్210, కేటీఎం ఆర్‌సీ 390 లాంటి బైక్స్‌కి పోటీగా నిలవనుంది.