KTR On Kaushik Reddy Arrest: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించిన కేటీఆర్, ఇదేనా ప్రజా పాలన?..ఇందిరమ్మ రాజ్యం? అంటూ కేటీఆర్ ఫైర్

ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.

KTR reaction on MLA Padi Kaushik Reddy arrest(X)

Hyd, Dec 5:  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్‌ను ఖండించారు మాజీ మంత్రి కేటీఆర్. ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎమ్మెల్యే ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారని తెలిసి ఏసీపీ పరార్... సీఐ పారిపోతారు అని ఎద్దేవా చేశారు.

ఎంత అధికార పార్టీకి ఊడిగం చేస్తే మాత్రం ప్రతిపక్ష ఎమ్మెల్యేను అధికారికంగా మీ ఆఫీసులోనే కలిసేందుకు కూడా భయమా? , పట్టుకొని నిలదీస్తే... అక్రమ కేసులా? ఇదెక్కడి రాజకీయం? ఇదేనా ప్రజా పాలన, ఇందిరమ్మ రాజ్యం? అని ప్రశ్నించారు.  బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై పోలీస్ కేసు, ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం..కౌశిక్ ఇంటికి పోలీసులు..వీడియో ఇదిగో 

Here's KTR Tweet:

మీ అక్రమాలను ప్రశ్నిస్తే మా ఎమ్మెల్యేలపై కేసులు పెడుతున్నారు. కానీ ఇవేవీ ప్రజా గొంతుకులైన మాకు అడ్డం కావు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా... ప్రశ్నిస్తూనే ఉంటాం, పోరాడుతూనే ఉంటాం..జై తెలంగాణ అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు కేటీఆర్.