KTR on Musi River: మూసి బ్యూటిఫికేషన్ కాదు లూసిఫికేషన్, గ్రాఫిక్స్ మాయాజాలంతో నానా తంటాలు పడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మూసీ రివర్ ప్రాజెక్టుపై కేటీఆర్ పవన్ పాయింట్ ప్రజెంటేషన్
తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.
Hyd, Oct 18: సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది మూసీ బ్యూటిఫికేషన్ కాదు లూటిఫికేషన్ అని ప్రజలకు తెలిసిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మూసి రివర్ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కేటీఆర్. అన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో, ఏం చేయాలో తెలియక, గ్రాఫిక్స్ మాయాజాలంతో సీఎం రేవంత్ రెడ్డి నానా తంటాలు పడుతున్నారన్నారు.
మూసీ సుందరీకరణ విషయంలో సీఎం రేవంత్... రోజుకో మాట మాట్లాడుతున్నారన్నారు. ఒకరోజు సుందరీకరణ, ఇంకోరోజు ప్రక్షాళన, ఇంకోరోజు పునరుజ్జీవం, మరొకరోజు నల్లగొండకు మంచినీళ్లు అంటూ మాటలు మారుస్తున్నాడని దుయ్యబట్టారు.తన పాపం బయటపడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు నానా తంటాలు పడుతున్నారని ఎద్దేవా చేశారు.
బీఆర్ఎస్ హయాంలోనే మూసీ సుందరీకరణ పనులు చేపట్టామని, ఈ ప్రాజెక్టు ద్వారా లక్షమంది నిరాశ్రయులు అవుతారని ఈ ప్రాజెక్టును పక్కన పెట్టామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి... రెండు గంటల పాటు ప్రాజెక్టు లక్ష్యాల నుంచి మొదటుపెడితే లక్షన్నర అంచనా వ్యయం దాకా అన్ని అబద్దాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు అన్నారు. రేవంత్..నీది నోరా మోరా?, మూసీ సుందరీకరణ కోసం లక్షా యాభై వేల కోట్లు అని చెప్పలేదా?,దమ్ముంటే సెక్యూరిటీ లేకుండా మూసీ బాధితుల దగ్గరికి వెళ్దామని ఛాలెంజ్
మూసీ సుందరీకరణకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోని చూపించారు కేటీఆర్. ఇది మూసీ బ్యూటీఫికేషన్ కాదు.. లూటిఫికేషన్ అని ప్రజల్లో బలంగా నాటుకుపోవడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముచ్చెటమలు పడుతున్నాయన్నారు. చేయని సర్వేలను చేసినట్టు.. అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలను అర్థంపర్థం లేని అసంబద్ద వాదనలను సంపూర్ణంగా బయపటెట్టి తన పరువు తానే తీసుకున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ఎలాంటి సర్వే జరగలేదు అని ప్రజలే చెబుతున్నారన్నారు. జేసీబీలతో, కూలీలను పెట్టి ఇండ్లు కూలగొడుతున్నారు ఇది సరైంది కాదన్నారు కేటీఆర్. లక్షన్నర కోట్ల కుంభణానికి కాంగ్రెస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు దీనిని ప్రజలు గమనించారన్నారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించారు...ఇప్పుడు ఢిల్లీకి పంపే మూటల కోసం మూసీని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు కేటీఆర్.
Here's Video: