Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న బిల్డింగ్, లోపల పనులు చేస్తున్న ఇద్దరు కార్మికులు మృతి, ఆరుగురికి గాయాలు

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిన ఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీయడం జరిగిందని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు.

Screenshot of the video (Photo Credit- X/@ANI)

New Delhi, March 21: ఢిల్లీలోని కబీర్‌ నగర్‌ (Kabirnagar) ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనంలోని ఒక భాగం గురువారం తెల్లవారు జామున 2.30గంటల సమయంలో కుప్పకూలిపోయింది (Building Collapse). భవనం కూలిన సమయంలో అందులో కార్మికులు పనులు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా.. ఆరుగురు కార్మికులకు గాయాలయ్యాయి. పోలీసులు ఘటన స్థలికి చేరుకొని ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను స్థానిక జీటీబీ ఆస్పత్రికి తరలించారు. అయితే, అర్షద్ (30), తౌహీద్ (20) లు చికిత్స పొందుతూ మృతిచెందగా.. రెహాన్, అరుణ్, నిర్మల్, జలధర్ లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

భవనం కూలిన సమయంలో అందులో 13మంది వరకు పనిచేస్తున్నారని డీసీపీ రాజేష్ డియో తెలిపారు. భవన నిర్మాణంకు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ అనుమతులు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే, భవనం కూలిన ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Madhya Pradesh Horror: పెళ్ళైన యువతితో పారిపోయాడని యువకుడికి గుండు కొట్టించి మూత్రం తాగించిన స్థానికులు, సోషల్ మీడియాలో వీడియో వైరల్ 

ఢిల్లీ అగ్నిమాపక శాఖ అధికారి అనుప్ మాట్లాడుతూ.. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందిన ఘటనా స్థలానికి పంపినట్లు తెలిపారు. వారు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించారని, భవనం శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు కూలీలను బయటకు తీయడం జరిగిందని చెప్పారు. గాయపడిన వారికి చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారన్నారు.