Fact check: రేషన్ షాపుల్లో బలవంతంగా జెండాల అమ్మకాలు, అసత్య ప్రచారమంటూ స్పష్టం చేసిన కేంద్రం, ప్రజలు స్వచ్ఛందంగా జెండాలను తీసుకోవచ్చంటూ ప్రకటన, హర్ ఘర్ తిరంగాపై అసత్య ప్రచారాన్ని ఖండించిన కేంద్రం
అవన్నీ అసత్య ప్రచారాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకు చెందిన ఫ్యాక్ట్ చెక్ (Fact check) దీనిపై స్పష్టత ఇచ్చింది. రేషన్ కోసం జాతీయ పతాకాన్ని కొనాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది.
New Delhi, AUG 10: స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా ( Har Ghar Tiranga) పేరుతో చేపట్టిన కార్యక్రమంలో ఇప్పటికే దేశప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అయితే జెండాలను అమ్మేందుకు రేషన్ షాపులకు కేంద్రం టార్గెట్ పెట్టిందంటూ ఓ వార్త వైరల్ గా మారింది. రేషన్ Ration( తీసుకోవాలంటే...జెండా (Flag) కొనాల్సిందే అంటూ వార్తలు వచ్చాయి. అవన్నీ అసత్య ప్రచారాలని కేంద్రం స్పష్టం చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియాకు చెందిన ఫ్యాక్ట్ చెక్ (Fact check) దీనిపై స్పష్టత ఇచ్చింది. రేషన్ కోసం జాతీయ పతాకాన్ని కొనాలంటూ ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదని తెలిపింది. రేషన్ షాపుల్లో ప్రజలను బలవంతంగా జెండాలను కొనాలంటూ ఫోర్స్ చేస్తున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.
ప్రతి ఇంటికి జెండా కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇంటింటికీ ఉచితంగా జాతీయ జెండాలను పంపిణీ చేస్తోంది. కేంద్రం కూడా పోస్టాఫీసులు, బ్యాంకులు, రేషన్ షాపుల వంటి ప్రాంతాల్లో జెండాలను ప్రజల కోసం అందుబాటులో ఉంది. నామమాత్రపు డబ్బులు చెల్లించి జెండాలను తీసుకునేలా చర్యలు చేపట్టింది.
అయితే జాతీయ జెండాలను అమ్మేందుకు కేంద్రం రేషన్ షాపులను ఎంచుకుందని ప్రచారం మొదలైంది. కొన్ని ప్రాంతాల్లో బలవంతంగా రేషన్ షాపు డీలర్లు.... ప్రజలకు జాతీయ జెండాలను అమ్ముతున్నట్లు ప్రచారం జరిగింది. దీనిపై కేంద్రం తాజాగా స్పష్టత ఇచ్చింది.