Kejriwal CBI Questioning: ఢిల్లీ లిక్కర్‌ పూర్తిగా కల్పితం, తప్పుడు కేసులతో మమ్మల్ని భయపెట్టలేరు: కేజ్రీవాల్, తొమ్మిదిన్నర గంటల పాటూ కేజ్రవాల్‌ను విచారించిన సీబీఐ

అయితే, అప్పటినుంచి సీబీఐ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి కేజ్రీవాల్‌ బయటకు వచ్చి తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరి వెళ్లారు. అంతకముందు కేజ్రీవాల్‌కు సీబీఐ జారీ చేసిన సమన్లను తీవ్రంగా నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి.

Delhi CM Arvind Kejriwal (PIC @ ANI twitter)

New Delhi, April 16: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్  (CM Arvind Kejriwal) సీబీఐ (CBI questioning) విచారణ ముగిసింది. ఉదయం నుంచి ఆయన్ను తొమ్మిదిన్నర గంటలపాటూ విచారించారు సీబీఐ అధికారులు. అసలు ఢిల్లీ లిక్కర్ స్కాం (Delhi Liquor scam) అనేదే లేదని, ఇది పూర్తిగా కుట్రపూరితంగా పెట్టిన కేసుల అని స్పష్టం చేశారు సీఎం అరవింద్ కేజ్రీవాల్. నిజాయితీగల పార్టీగా ఆప్ పై ఉన్న ముద్రను...ఇలాంటి ఆరోపణలతో బదనాం చేయలేరన్నారు. అభివృద్ధిపై బీజేపీని (BJP) ప్రజలు ప్రశ్నిస్తుంటే...వాటిని ఎదుర్కునే దమ్ములేక, ప్రతిక్షాలపై బురద జల్లే యత్నం చేస్తోందని ఆరోపించారు.

ఆదివారం మధ్యాహ్నం 12గంటల సమయంలో కేజ్రీవాల్‌ సీబీఐ(CBI) ప్రధాన కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. అయితే, అప్పటినుంచి సీబీఐ అధికారులు ఆయన్ను సుదీర్ఘంగా ప్రశ్నల వర్షం కురిపించారు. విచారణ అనంతరం సీబీఐ కార్యాలయం నుంచి కేజ్రీవాల్‌ బయటకు వచ్చి తన కాన్వాయ్‌లో ఇంటికి బయల్దేరి వెళ్లారు. అంతకముందు కేజ్రీవాల్‌కు సీబీఐ జారీ చేసిన సమన్లను తీవ్రంగా  నిరసిస్తూ ఆ పార్టీ శ్రేణులు నిరసనకు దిగాయి. దీంతో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా పోలీసులను మోహరించి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు, తమ పార్టీ చీఫ్‌కు సీబీఐ సమన్లు జారీచేయడంపై ఆప్‌ నేతలు మండిపడుతున్నారు. సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగిన ఆందోళనకు దిగిన ఆప్‌ సీనియర్‌ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఆప్‌ ఎంపీలు సంజయ్‌ సింగ్‌, రాఘవ్‌ చద్దా, మంత్రులు సౌరభ్‌ భరద్వాజ్‌, అతిషీ, కైలాశ్‌ గహ్లోత్‌, ఆప్‌ అధికార ప్రతినిధి అదిల్‌ అహ్మద్‌ ఖాన్‌, ఆప్‌ ప్రధాన కార్యదర్శి పంకజ్‌గుప్తాతో పాటు పలువురు పంజాబ్‌ మంత్రులు ఉన్నారు. ప్రశాంతంగా కూర్చొని నిరసన తెలుపుతున్న తమను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారని.. ఎక్కడో తెలియని ప్రాంతానికి తరలిస్తున్నారని ఆప్‌ రాజ్యసభ ఎంపీ రాఘవ్‌ చద్దా ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్ విచారణ ముగిసిన అనంతరం వారిని విడుదల చేశారు.

కేజ్రీవాల్ విచారణ నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా దాదాపు 1500 మందిని నిరసనకారులను పోలీసులు అరెస్టు చేశారు. 32 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు, 70మంది కౌన్సిలర్లతో పాటు ఢిల్లీ సరిహద్దుల్లో 20 మంది పంజాబ్‌ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారని ఆప్‌ ఢిల్లీ కన్వీనర్‌ గోపాల్‌ రాయ్‌ అన్నారు. తమ నేతలను నిర్బంధించిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఆప్‌ ఆఫీస్‌ బేరర్లతో ఆయన అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.



సంబంధిత వార్తలు

CM Revanth Reddy: సర్వమత సమ్మేళనంం తెలంగాణ, మత విద్వేషాలు రెచ్చగోడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం రేవంత్ రెడ్డి, క్రిస్టియన్ల సంక్షేమం- అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తామన్న సీఎం

Delhi High Court: పరస్పర సమ్మతితో చేసే శృంగారం రేప్‌ కాదు.. వేధింపుల కోసం చట్టాన్ని వాడుకోవద్దు.. ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు

Gun Fire in AP: ఏపీలోని అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం.. ఇద్దరికి తీవ్రగాయాలు.. అసలేం జరిగిందంటే??

Pawan Kalyan Welcome Film Industry To AP: ఏపీలో షూటింగ్స్ చేయండి! సినీ ఇండస్ట్రీకి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆహ్వానం, అల్లు అర్జున్ పై రేవంత్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో ప్రాధాన్య‌త సంత‌రించుకున్న కామెంట్స్

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif