CBI Raids D.K. Shivakumar's Premises: డి.కె. శివకుమార్ నివాసంపై సీబీఐ ఆకస్మిక దాడి, ఏక కాలంలో 15 ప్రాంతాల్లో సోదాలు, ఉప ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు
Shivakumar's Premises) ఆకస్మిక దాడులు చేశారు. డీకే శివకుమార్ (D. K. Shivakumar) పై ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ (CBI) గతంలో కేసులు నమోదు చేసిన విషయం విదితమే. డీకే శివకుమార్ తోపాటు అతని సోదరుడు డీకే సురేష్ కు చెందిన కర్ణాటక, ముంబై ఇళ్లలోనూ (DK Shivakumar's Premises) సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.
Bengaluru, October 5: కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ నివాసంపై సీబీఐ అధికారులు (CBI Raids D.K. Shivakumar's Premises) ఆకస్మిక దాడులు చేశారు. డీకే శివకుమార్ (D. K. Shivakumar) పై ఆదాయపు పన్ను ఎగవేత, మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, సీబీఐ (CBI) గతంలో కేసులు నమోదు చేసిన విషయం విదితమే. డీకే శివకుమార్ తోపాటు అతని సోదరుడు డీకే సురేష్ కు చెందిన కర్ణాటక, ముంబై ఇళ్లలోనూ (DK Shivakumar's Premises) సీబీఐ అధికారులు సోదాలు జరిపారు.
శివకుమార్ వద్ద అక్రమంగా 8.6 కోట్లను అధికారులు గుర్తించారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని 11 కోట్లకు పెంచేశారు. 2018లో శివకుమార్‌పై ఈడీ మనీల్యాండరింగ్ కేసును నమోదు చేసింది. ఐటీ శాఖ ఫైల్ చేసిన చార్జ్‌షీట్ ఆధారంగా ఈడీ విచారణ మొదలుపెట్టింది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఎఎన్ఐ రిపోర్టు ప్రకారం సీబీఐ అధికారులు ట్రబుల్ షూటర్ నివాసంలో రూ. 50 లక్షల నగదును సీజ్ చేశారని తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వాన్ని తిట్టినందుకే బీజేపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతుందని మాజీ సీఎం సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. ఉప ఎన్నికలకు తాము సంసిద్ధం కాకుండా దెబ్బతీసేందుకు కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు చేయించారని సిద్ధరామయ్య ఆరోపించారు.
అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై సోమవారం ఉదయం ఆకస్మిక దాడులు చేసిన అధికారులు, కర్ణాటకలోని దొడ్డనహళ్లి, కనకాపుర, సదాశివ నగర్‌తో పాటు ముంబై తదితర 15 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం. సుమారు 60 మంది అధికారులు ఇందులో పాల్గొన్నట్లు తెలుస్తోంది. డీకే శివ కుమార్‌తో పాటు ఆయన సోదరుడు డీకే సురేష్‌కు సంబంధించిన నివాసాల్లోనూ దాడులు కొనసాగుతున్నాయి.
కాగా రాజరాజేశ్వర నగర్, సిరా అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరుగనున్న తరుణంలో కాంగ్రెష్ పార్టీ ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ ఇంటిపై సీబీఐ దాడులు నిర్వహించడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎన్నికలకు సన్నద్ధమవుతున్న వేళ తమను దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే కేంద్రం కక్షపూరిత చర్యలకు దిగిందంటూ కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
డికె శివకుమార్‌కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచన
ఇక ఈ విషయంపై తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా.. ప్రధాని మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప చేతిలో తోలుబొమ్మగా మారిన సీబీఐ డీకే శివకుమార్ నివాసంలో సోదాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు తమను ఏమీ చేయలేవన్నారు. కర్ణాటకలో బీజేపీ సర్కారు అవినీతిని సీబీఐ తొలుత బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ గతేడాది సెప్టెంబరులో డీకే శివకుమార్‌ను ఢిల్లీలో అరెస్టు చేసింది. సుమారు 50 రోజుల పాటు ఆయన జైలులోనే ఉన్నారు. అనేక అభ్యర్థనల అనంతరం బెయిలు మంజూరైన తర్వాత తీహార్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. కాగా పన్ను ఎగవేత, కోట్లరూపాయల హవాలా లావాదేవీలపై శివకుమార్ పై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేసి అభియోగాలు మోపింది