DK Shivakumar Covid 19: డికె శివకుమార్‌కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్-19 పరీక్షలు చేయించుకోవాలని సూచన, ఆస్పత్రిలో చేరిన కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు
DK Shivakumar (Photo Credits: PTI)

Bengaluru, August 25: కర్ణాటకలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ఉద్యాన నగరి బెంగళూరులో ఇప్పటికే లక్ష మార్క్‌ను దాటిక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మరింత బలపడుతున్నాయి. తాజాగా కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్‌కు కరోనావైరస్ (DK Shivakumar Tests Positive for Coronavirus) సోకింది. కరోనా పరీక్ష చేయించుకోగా మంగళవారం పాజిటివ్‌గా రిపోర్టు వచ్చినట్లు ఆయన చెప్పారు. దీంతో బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేరినట్లు శివకుమార్ తెలిపారు.

ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, హోం క్వారంటైన్‌లో ఉండాలని ఆయన (Karnataka Congress State President) సూచించారు. కర్ణాటక సీఎం బి.ఎస్.యడ్యూరప్ప, మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధ రామయ్య, ఆయన కుమారుడుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడ్డారు. వారిలో కొందరు కోలుకున్నారు. మెదంత ఆస్పత్రికి హర్యానా సీఎం, కేంద్ర మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్య పరిస్థితి విషమం, కోమాలో మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ

కొద్దిరోజులుగా డీకే శివకుమార్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రత్యేకించి- బెంగళూరులోని పులకేశి నగర కాంగ్రెస్ ఎమ్మెల్యే అఖండ శ్రీనివాస మూర్తి నివాసంపై అల్లరిమూకలు దాడి చేయడం, ఇంటిని తగులబెట్టిన ఘటనల అనంతరం డీకే శివకుమార్ పార్టీ నేతలు, కార్యకర్తలో విస్తృత సమావేశాలను నిర్వహించారు. వరదల్లో నష్టపోయిన ప్రాంతాల్లోనూ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు కరోనా వైరస్‌ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ, దేశంలో తాజాగా 60,975 మందికి కరోనా, 31,67,324 కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 3.5కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

సోమవారం అధికారులు విడుదల చేసిన వివరాల ప్రకారం.. బృహత్ బెంగళూరు మహానగర పాలికె పరిధిలో 1,09,793 కరోనా కేసులు ఉన్నాయి. ఇందులో 73,363 మంది డిశ్చార్జి అయ్యారు. 1695 మంది కరోనా వల్ల మరణించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కిందటి నెల వారం రోజుల పాటు సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. అయినా అదుపులోకి రాలేదు. ఇక కర్ణాటక రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2.84 లక్షలు ( Karnataka Coronavirus) దాటగా 4,800 మందికిపైగా మరణించారు.