Mumbai, August 25: దేశంలో గత 24 గంటల్లో 60,975 మందికి కరోనా (Coronavirus) సోకిందని, అదే సమయంలో 848 మంది మృతి (Coronavirus Deaths) చెందారని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 31,67,324 కు ( India's COVID-19 Tally)చేరగా, మృతుల సంఖ్య మొత్తం 58,390కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 24,04,585 మంది కోలుకున్నారు.
7,04,348 మందికి ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో ఇప్పటి వరకు 3.5కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) తెలిపింది. సోమవారం ఒకే రోజు 9.25లక్షలకుపైగా పరీక్షలు చేసినట్లు చెప్పింది. ఇందుకు టెస్ట్ ట్రాక్ ట్రీట్ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు వివరించింది.
దేశ రాజధాని ఢిల్లీలో ఐదు నుంచి 17 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు, టీనేజర్లకు కరోనా వైరస్ సోకే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయని సీరం సర్వేలో వెల్లడయ్యింది. ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు 7వ తేదీ మధ్య ఢిల్లీలో రెండోసారి ఈ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం దేశ రాజధాని జనాభాలో 29.1 శాతం మందిలో సార్స్-కోవ్-2తో పోరాడే ప్రతిరోధకాల అభివృద్ధి జరిగింది. ఈ సర్వేలో 15 వేల మంది పాల్గొన్నారు. వారిలో 25 శాతం మంది 18 ఏళ్లలోపు వారు కాగా, 50 శాతం మంది 18 నుంచి 50 ఏళ్లలోపు వారు. మిగిలిన వారు50 ఏళ్లు పైబడిన వారు ఉన్నారు. ఐదు నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న వారిలో 34.7 శాతం మంది ఇన్‌ఫెక్షన్‌కు గురయ్యే అవకాశం ఉందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. కరోనాకు బీపీ మందులతో చెక్, బ్లడ్ ప్రెషర్ రోగులకిచ్చే మందులు అద్భుతంగా పనిచేస్తున్నాయని లండన్ తాజా సర్వే ద్వారా వెల్లడి, కరోనా రోగుల శవ పరీక్షల్లో దిమ్మతిరిగే విషయాలు
దీని ప్రకారం 50 ఏళ్లు పైబడిన వారిలో 31.2 శాతం మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. 18 నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల వారిలోని 28.5 శాతం మందిలో వైరస్‌తో పోరాడే ప్రతిరోధకాలు అభివృద్ధి చెందాయని సర్వేలో తేలింది. ఇండియన్ మెడికల్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం 21 నుంచి 50 సంవత్సరాల వయస్సు గల వారిలో 61.31 శాతం మంది కరోనా వైరస్ బారిన పడ్డారు.