London, August 24: కరోనా వైరస్‌కు ఇప్పటి వరకు మందు అయితే రాలేదు. కాని ఎవరికి వారే పలు రకాల సర్వేలతో ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారు. తాజాగా కరోనా బారిన పడిన ‘హై బ్లడ్ ప్రెషర్’ రోగులకు బ్లడ్ ప్రెషర్ నివారణ మందులను (Blood pressure drugs) ఇవ్వడం వల్ల వారు అద్భుతంగా కరోనా వైరస్ బారి నుంచి కోలుకున్నారని (BP Drugs Cuts Covid Death Risk) లండన్‌లో నిర్వహించిన ఓ తాజా సర్వే తెలియజేస్తోంది.
కరోనాతో బాధ పడుతున్న బ్లడ్ ప్రెషర్ రోగులకు రామిప్రిల్, లొసార్టన్ మందులు (Ramipril, Losartan) ఇవ్వగా, వారిలో మూడోవంతు మంది, అంటే 33 శాతం మంది ప్రాణాపాయం నుంచి తప్పించుకొని, కోలుకున్నారని ‘యూనివర్శిటీ ఆఫ్ ఈస్ట్ ఎంజిలా పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. ఇదిలా ఉంటే బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్’తో బాధ పడుతున్న వారికి కరోనా వైరస్ సోకినట్లయితే ప్రాణాంతకమవుతుందని ఇప్పటికి పలు సర్వేలు వెల్లడించాయి.
ఎక్కువ శాతం మంది బీపీ రోగులు వెంటిలేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే కోలుకున్నారని, వెంటిలేటర్ వరకు వెళ్లిన కరోనా రోగులు కూడా ఈ మందులతోని కోలుకున్నారని పరిశోధకులు తెలిపారు. అయితే బీపీ లేని కరోనా రోగులపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుందో! ఇంకా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని వారన్నారు. తాము ప్రస్తుతం బీపీ ఉన్న రోగులపై అధ్యయనానికే పరిమితం అయ్యామని వారు చెప్పారు. కరోనాకి రష్యా వ్యాక్సిన్ చెక్, పుతిన్ కూతురుకి తొలి వ్యాక్సిన్, ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని తెలిపిన రష్యా అధ్యక్షుడు
బ్రిటన్‌లో బీపీతో బాధపడుతున్న దాదాపు 60 లక్షల మంది ఈ డ్రగ్స్‌ను వాడుతున్నారు. అమెరికాలో దాదాపు కోటి మంది బీపీతో బాధ పడుతున్నారు. బీపీ రోగులు కరోనా నుంచి కోలుకునేందుకు రామిప్రిల్, లొసార్టన్ మందులు బాగా పని చేస్తున్నట్లు దాదాపు 30 వేల మంది కరోనా రోగులపై యూనివర్శిటీ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది. యాంజియోటెన్సిన్- కన్వర్టింగ్ ఎంజైమ్ (ఏసీఈ), యాంజియోటెన్సిన్ రిసెపర్టర్ బ్లాకర్స్ (ఏఆర్‌బీ) అనే మందులను హైబీపీ, హార్ట్ ఎటాక్, డయాబెటిస్ కోసం వాడుతుంటారు. ఈ మందులు వేసుకున్న వారిలో కరోనా కారణంగా చనిపోయే ముప్పు గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు.
డయాబెటిస్, కిడ్నీ ఫెయిల్యూర్ లాంటి సమస్యలతో బాధపడుతున్న పేషెంట్లు ఏసీఈ, ఏఆర్‌బీలను వాడినప్పుడు వారిలో కరోనా తీవ్రత తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కరోనా రాక ముందు నుంచి ఈ మందులు వాడుతున్న వారిలో కోవిడ్ ప్రభావం తక్కువగా ఉంది కానీ.. కరోనా వచ్చాక వేసుకుంటే వైరస్ ప్రభావం తక్కువగా ఉందని చెప్పడానికి ఆధారాల్లేవని పరిశోధకులు తెలిపారు. స్పుత్నిక్ వీ కోసం క్యూ కడుతున్న దేశాలు, రష్యా తొలి వ్యాక్సిన్ కోసం 20 దేశాల నుంచి బిలియన్ డోసుల కంటే ఎక్కువ ప్రీ ఆర్డర్లు, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి
ఇదిలా ఉంటే కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి ఊపిరితిత్తుల్లో గాయాలు, రక్తం గడ్డకట్టడం వంటివి సాధారణంగా ఉన్నాయని లండన్‌కు చెందిన పరిశోధకులు వెల్లడించారు. వారు నిర్వహించిన పది పోస్టుమార్టాల్లో మృతులందరికీ ఊపిరితిత్తుల్లో గాయాలున్నాయని, ప్రారంభ లక్షణాలుగా ఊపిరితిత్తుల్లో మచ్చలు, కిడ్నీల్లో గాయాలు అయ్యాయని తెలిపారు. దాదాపు తొమ్మిది మందిలో ప్రధాన అవయవాలైన గుండె, కిడ్నీలు, ఊపిరితిత్తులో రక్తం గడ్డ కట్టిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ నివేదికను ఇంపీరియల్ కాలేజ్ వెబ్‌సైట్లో ప్రచురించారు.
తాము కనుగొన్న ఈ వివరాల ద్వారా కరోనా రోగులకు మరింత మెరుగైన వైద్యం అందించే అవకాశం ఉందని, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ ద్వారా సంభవించే మరణాలను అడ్డుకోవచ్చని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. బ్లడ్ తిన్నర్స్‌ను ఉపయోగించటం ద్వారా రక్తం గడ్డకట్టకుండా ముందుగానే జాగ్రత్త పడొచ్చని చెప్పారు. ఇలాంటి పరిశోధనలు రోగుల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించటానికి, సరైన చికిత్స అందించటానికి ఉపయోగపడతాయని అన్నారు. చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ సంక్షోభం, తరుముకొస్తున్న కరువు ఛాయలు, క్లీన్ యువర్ ప్లేట్ ఉద్యమం మొదలుపెట్టిన చైనా అధినేత జీ జిన్‌పింగ్
పొగతాగే వ్యసనం ఉన్న వారికి ఊపిరితిత్తులు దెబ్బతింటాయని, ఇటువంటి వారికి కరోనా వైరస్ సోకితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ ఫర్ స్మోక్–ఫ్రీ వరల్డ్’ సంస్థ తాజాగా నిర్వహించిన సర్వేలో అనేక మంది పొగ తాగడానికి దూరంగా ఉన్నట్టు తేలింది. భారత్‌లో లాక్‌డౌన్ సమయంలో 72% మంది పొగ తాగడం మానేయాలని నిర్ణయం తీసుకున్నారు. చివరకు వీరిలో 66% మంది అలవాటును మానేశారు. పొగతాగడం వల్ల కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వీరిలో 48% మంది భావించారని సర్వే తెలిపింది.