Beijing, August 18: చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ భయంకరమైన సంక్షోభం (facing food crisis) రానుందనే వార్తలు ఆ దేశాన్ని నిదరపోనీయడం లేదు. భయంకరమైన దుర్భిక్షం దేశాన్ని మళ్ళీ కమ్ముకోబోతోంది. దాదాపు 60 సంవత్సరాల క్రితం అంటే 1959లో అప్పటి చైనా అధినేత మావో జెడాంగ్ దేశ ప్రజలందరినీ తక్కువగా తినాలని, ఖాళీ సమయాలో ఏదో ఒకటి తినడం ఆపేయాలని ఆయన కోరారు. ఆహార పదార్థాల రేషనింగ్ కూడా చేశారు. అయితే ఈ ఇప్పుడు అదే పరిస్థితులు చైనాను (China) చుట్టిముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి చైనా అధినేత జీ జిన్‌పింగ్ (Chinese President Xi Jinping) స్వయంగా- క్లీన్ ప్లేట్ పేరిట ఓ ఉద్యమాన్ని (Clean Your Plate Campaign) ఆరంభించారు. ఆహార వృథాను తగ్గించాలని దేశప్రజలకు పిలుపునిస్తున్నారు.
ఇప్పటికిప్పుడు ఆహార కొరత లేకపోయినప్పటికీ- భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు తప్పవని ముందే గ్రహించిన కమ్యూనిస్ట్ నాయకత్వం ఈ ఉద్యమాన్ని ఆరంభించినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ ఆహార భద్రత ఉద్యమం 2013లోనే తొలిసారిగా- ఆపరేషన్ ఎమ్టీ ప్లేట్ పేరిట మొదలైంది. దానికి కొనసాగింపుగా అన్నట్లు ఇపుడు ఆపరేషన్ క్లీన్ ప్లేట్ -2.0ను మొదలెట్టారు. అనధికార సమాచారం ప్రకారం దాదాపు ఆరు నుంచి 9 రాష్ట్రాల్లో కరువు ఛాయలు, కొన్ని చోట్ల వరదలతో భారీగా దిగుబడి తగ్గిపోవడం, కొవిడ్ కారణంగా భారత్ సహా అనేక దేశాల నుంచి దిగుమతులూ లేకపోవడంతో ఈ క్లీన్ ప్లేట్ ఉద్యమం మొదలెట్టినట్లు తెలుస్తోంది. అమెరికాను వణికిస్తున్న ఎర్ర ఉల్లిపాయ, యుఎస్, కెనడాలో పెరుగుతున్న సాల్మొనెల్లా కేసులు, ఎరుపు రంగు ఆనియన్స్ ద్వారా వ్యాధి వస్తుందని తెలిపిన సీడీసీ
ప్రధాన నగరాల్లో జరిపిన క్షేత్రస్థాయి అధ్యయనం ప్రకారం దేశంలోని పట్టణ ప్రాంతాల్లో ఏటా కనీసం 1800 కోట్ల కిలోల ఆహార వృథా జరుగుతోంది. ఇది కనీసం 5 కోట్ల మంది ఆకలిని తీర్చగలదని రిపోర్టులు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే కొవిడ్ కేవలం వుహాన్ నగరానికి మాత్రమే పరిమితమైనప్పటికీ దీని ప్రభావం దేశమంతా కనిపిస్తోంది. అనేక రాష్ట్రాల్లో రైతులు తమ పంటను గొడౌన్లకు తరలించడానికి విముఖత చూపారు. దీనికి కారణం లేకపోలేదు.. దేశవ్యాప్తంగా ఆహార దినుసుల ధరలు పెరగడం. దీంతో సగం గోడౌన్లు ఖాళీగా మిగిలాయి. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం, పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని ఆర్డర్ జారీ చేసిన కిమ్ జాంగ్, కుదేలైన వ్యవసాయ, పాడిపరిశ్రమ రంగాలు
చైనా ఎక్కువగా గోధుమ, వరి, మొక్కజొన్న పండిస్తుంది. అయితే ఈసారి వరదల వల్ల గోధుమ దిగుబడి కనీసం 14-20 శాతం తగ్గింది. అధికారిక లెక్కల ప్రకారం లక్షల హెక్టార్లలో పంట మునిగిపోవడం వల్ల దిగుబడి ఈ ఏడాది కనీసం 11.2 మిలియన్ టన్నుల మేర పడిపోనుంది. గతంతో పోల్చితే 2 శాతం తక్కువ. పదేళ్లలో తొలిసారి గోధుమలను దిగుమతి చేసుకోవాల్సి వచ్చింది. ఈ ఏడాది జూలై వరకు 74.51 మిలియన్ టన్నుల గోధుమను దిగుమతి చేసుకున్నట్లు చైనా కస్టమ్స్ శాఖ వివరించింది.