Pyongyang, August 18: ఉత్తర కొరియాలో ఇప్పుడు ఆహార సంక్షోభ ఛాయలు (Food Shortages) కనపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ దేశ అధినేత కిమ్ జాంగ్ సంచలన నిర్ణయం (Kim Jong Un Orders) తీసుకున్నారు. దేశంలో మాంసం కొరతను.. ప్రజలు ఎంతో ముద్దుగా పెంచుకునే పెంపుడు కుక్కలతో ( Pet Dogs) భర్తీ చేయాలని డిసైడ్ అయ్యాడు. ఈ నేపథ్యంలో జులై నెలలో కీలక ఆదేశాలు జారీ చేశాడు. ఇళ్లల్లో కుక్కలను పెంచుకోవడం ఇకపై నేరమని కిమ్ (Kim Jong Un) ఆదేశించాడు. దీంతో కుక్కలను పెంచుకుంటున్న ప్రజల ఇళ్లను గుర్తించిన అధికారులు.. వారి నుంచి బలవంతంగా కుక్కలను లాక్కుంటున్నారు. వాటిని ప్రభుత్వం నిర్వహిస్తున్న జూలకు, కుక్క మాంసాన్ని వండే రెస్టారెంట్లకు తరలిస్తున్నారు.
ఇదిలా ఉంటే ప్రజల నుంచి వచ్చే పన్నులను ఆయుధాలను సమకూర్చుకోవడంపైనే దృష్టిపెట్టడంతో దేశంలో వ్యవసాయం, పాడిపరిశ్రమ దారుణంగా దెబ్బతిన్నది. దీంతో దేశంలో ఆహరం కొరత ఏర్పడింది. ఐక్య రాజ్యసమితి లెక్కల ప్రకారం.. ఉత్తర కొరియాలో 25.5 మిలియన్ మంది ప్రజలు ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు. తినడానికి తిండిలేక అల్లాడుతున్నారు.చైనాలో 60 ఏళ్ల తరువాత మళ్లీ సంక్షోభం, తరుముకొస్తున్న కరువు ఛాయలు, క్లీన్ యువర్ ప్లేట్ ఉద్యమం మొదలుపెట్టిన చైనా అధినేత జీ జిన్‌పింగ్
మాంసాహారంలో వినియోగించాల్సిన కోళ్లు, మేకలు, పందులు వంటి వాటికీ కొరత ఏర్పడింది. చివరకు అక్కడ కుక్కలను మాంసం కోసం వినియోగిస్తున్నారు. వీటి వినియోగం ఎక్కువ కావడంతో ఆ దేశంలో వీటికి కూడా కొరత వచ్చే అవకాశం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ప్రజలు తమ పెంపుడు కుక్కలను ప్రభుత్వానికి అప్పగించాలని కిమ్ ఆదేశాలు జారీ చేశారు.
ఆహార కొరత వల్ల ఉత్తర కొరియాలో ఇటీవల కుక్క మాంసం తినేవారి సంఖ్య క్రమేనా పెరిగింది. ముఖ్యంగా వేసవి కాలంలో కుక్కలను ఎక్కువగా తింటారు. కుక్క మాంసం తినడం వల్ల శరీరానికి శక్తి, సామర్థ్యం పెరుగుతుందని నమ్మడం వల్లే వాటికి అంత డిమాండ్ ఉంది. దీంతో ఉత్తర కొరియాలో కుక్కలే దొరకని పరిస్థితి నెలకొంది. ఈ కొరతను తీర్చేందుకు కిమ్ పెంపుడు కుక్కలను ఎత్తుకెళ్లడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే.. కిమ్ భవిష్యత్తులో మనిషులను కూడా చంపుకు తింటాడని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.