Hyderabad, Sep 16: ప్రఖ్యాత 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ (Morning Consult) చేపట్టిన తాజా సర్వేలో ప్రధాని మోదీ (PM Modi) మరోసారి హవా చూపించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాకర్షక నేతగా మోదీ మరోసారి నెంబర్ వన్ స్థానంలో నిలిచారు. 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ ఓ సర్వే (Survey) నిర్వహించగా, మోదీ నాయకత్వానికి అత్యధికంగా 76 శాతం మంది జై కొట్టారు. రెండో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలాయిన్ బెర్సెట్ ఉన్నారు. అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల జాబితాలో మొదటి స్థానంలో ఉన్న మోదీకి, రెండో స్థానంలో ఉన్న బెర్సెట్ కు మధ్య 12 పాయింట్ల అంతరం ఉంది.
PM Modi remains most popular global leader with 76% rating.https://t.co/GBAT95Ckm3
— Dr Vijay Chauthaiwale (@vijai63) September 15, 2023
జో బైడెన్ స్థానం ఎంత అంటే??
గత కొన్నేళ్లుగా, ప్రపంచ ప్రజాదరణ కలిగిన నేతల జాబితాల్లో మోదీనే అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఏడో స్థానంలో ఉన్నారు. సర్వేలో ఆయనకు 40 శాతం మంది మద్దతు పలికారు. సెప్టెంబరు 6 నుంచి 12 తేదీల మధ్య సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితా రూపొందించారు.