Moscow, August 11: కరోనా ప్రపంచాన్ని కల్లోల పరుస్తున్న వేళ రష్యా తీపి కబురు అందించింది. ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ప్రకటించారు. రష్యా తీసుకొస్తున్న కరోనా వ్యాక్సిన్‌కు పేరును (Russia's Sputnik V) కూడా ఖరారు చేసింది. స్పుత్నిక్ వీ (Sputnik V) పేరుతో కరోనా వ్యాక్సిన్‌ను మార్కెట్లోకి తీసుకొస్తామని రష్యా వెల్లడించింది. ఈ విషయాన్ని ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం చేసిన్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ అధిపతి కిరిల్ డిమిత్రియేవ్ (Kirill Dmitriyev) వెల్లడించారు.
స్పుత్నిక్ వీ (Sputnik V) కి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్‌కు (Russia Coronavirus Vaccine) సంబంధించి వచ్చే తప్పుడు వివరాలను ఖండించడమే కాక దాని వాస్తవాలను తెలియజేస్తామన్నారు. ఆగస్టు 12 నుంచి ఫేస్ 3 ట్రయల్స్ ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ నుంచి వ్యాక్సిన్ ఉత్పత్తి ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రపంచంలోని 20 దేశాలు ఇప్పటికే బిలియన్ డోసుల కంటే ఎక్కువగా ప్రి ఆర్డర్ చేశాయని కిరిల్ వివరించారు. పుతిన్ కూతురుకి తొలి వ్యాక్సిన్, ప్రపంచంలోనే తొలి కోవిడ్-19 వైరస్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని తెలిపిన రష్యా అధ్యక్షుడు
ఇదిలా ఉంటే తొలి వ్యాక్సిన్ ను తన ఇద్దరి కూతుర్లలో ఒకరికి ఇచ్చినట్లు రష్యా అధినేత (Putin) ప్రకటించారు. కరోనా వైరస్ సోకిన తన కూతురికి ఆ టీకాను ఇచ్చినట్లు పుతిన్ వెల్లడించారు. వ్యాక్సిన్ (First Covid-19 Vaccine) ఇచ్చిన తర్వాత తన కూతురి శరీరంలో స్వల్పలంగా ఉష్ణోగ్రతలు పెరిగినట్లు అధ్యక్షుడు పుతిన్ చెప్పారు. కానీ త్వరగానే తన కూతురు సాధారణ స్థాయికి వచ్చిట్లు తెలిపారు. టీకా ప్రయోగంలో భాగంగా తన కూతురు పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.
తొలిసారి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత తన కూతురి టెంపరేచర్ 38గా నమోదు అయ్యిందని, తర్వాత రోజు టెంపరేచర్ 37కు పడిపోయినట్లు రష్యా అధ్యక్షుడు తెలిపారు. తొలుత వైద్య సిబ్బంది, ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్ చేపడతామని తెలిపారు. రష్యాకు చెందిన గామలేయా ఇనిస్టిట్యూట్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది.త్వరలోనే ఆ టీకాను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయనున్నట్లు పుతిన్ తెలిపారు. కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్ బిల్ గేట్స్, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి
రష్యాలో ఇప్పటి వరకు 8,97,599 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 15,131 మంది కరోనా బారినపడి మరణించారు. తాజాగా 4,945 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో యూఎస్ఏ, బ్రెజిల్, ఇండియాల తర్వాత రష్యా కొనసాగుతోంది.