Haryana Chief Minister Manohar Lal Khattar. (Photo Credits: IANS)

Gurugram, August 25: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ (Manohar Lal Khattar) కరోనా వైరస్‌ బారినపడిన సంగతి విదితమే. గత రెండు రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు సోమవారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు గుర్ గావ్ లోని మెదంత ఆసత్రి (Medanta hospital) వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతవారం రోజుల్లో సీఎంను నేరుగా భేటీ అయిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని, బహిరంగ ప్రదేశాల్లో తిరగకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటికే పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

తాజాగా హర్యానా కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా పాజిటివ్ అని మంగళవారం వెల్లడైంది. హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు కరోనా సోకిన రెండో రోజే అతని కేబినెట్ మంత్రి మూల్ చంద్ శర్మకు కరోనా సోకింది. తనకు కరోనా సోకిందని హర్యానా రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మూల్ చంద్ శర్మ మంగళవారం ఉదయం ట్వీట్ చేశారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి మూల్ చంద్ కోరారు. వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందు స్పీకర్‌కు వైరస్‌ సోకిందన్నారు. ఆరుగురు అసెంబ్లీ సిబ్బందికి కూడా కరోనా సోకింది. అయితే, స్పీకర్‌ గైర్హాజరులో డిప్యూటీ స్పీకర్‌ రణబీర్‌ గంగ్వా సభా కార్యకలాపాలను నిర్వహిస్తారు. పిల్లలకు, టీనేజర్లకు కరోనా ముప్పు ఎక్కువ, దేశంలో తాజాగా 60,975 మందికి కరోనా, 31,67,324 కు చేరుకున్న కోవిడ్-19 కేసుల సంఖ్య, 3.5కోట్ల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు

కాగా కేంద్ర ఆయుష్‌శాఖ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ఆయనలో ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోయాయని గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ సోమవారం చెప్పారు. కరోనా మహమ్మారి బారిన పడిన శ్రీపాద్‌ నాయక్‌ ప్రస్తుతం గోవా రాజధాని పనాజీలో ఓ ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వైద్య పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని రావడంతో శ్రీపాద్‌నాయక్‌ ఈ నెల 12 నుంచి పనాజీలోని ప్రైవేట్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ ఆరోగ్యంలో ఎటువంటి మార్పు లేదని, ఆయన కోమాలోనే ఉన్నారని ఢిల్లీలోని ఆర్మీ రీసెర్చ్‌ అండ్‌ రిఫరల్‌ దవాఖాన సోమవారం తెలిపింది. శ్వాసకోశ సంబంధ ఇన్‌ఫెక్షన్‌కు వైద్యులు చికిత్సనందిస్తున్నారని పేర్కొంది. వెంటిలేటర్‌ మద్దతుపై చికిత్సనందిస్తున్నట్లు వెల్లడించింది.