Chandan Jindal Dies: ఉక్రెయిన్‌లో మరో భారతీయ విద్యార్థి మృతి, అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో సర్జరీ చేసిన వైద్యులు, ఆరోగ్యం క్షీణించడంతో తిరిగిరాని లోకాలకు..
అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి (Chandan Jindal Dies of Stroke in Ukraine) చెందాడు.
Chandigarh, March 2: ఉక్రెయిన్ సంక్షోభం మరింత తీవ్రతరం కావడంతో అక్కడ ఉన్న భారతీయులను తరలింపు ప్రక్రియను కేంద్రం వేగవంతం చేసింది. అయితే దురదృష్టవశాత్తు మంగళవారం ఖార్కివ్‌లో రష్యన్ షెల్లింగ్‌లో మెడిసిన్ విద్యార్థి నవీన్ మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో భారతీయ విద్యార్థి అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి (Chandan Jindal Dies of Stroke in Ukraine) చెందాడు.
22 ఏళ్ల చందన్ జిందాల్ (Family of 22-Year-Old Student From Punjab) ఉక్రెయిన్‌లోని విన్నిట్సియాలో నాలుగేళ్లుగా చదువుతున్నాడు. అతను పంజాబ్‌లోని బుర్నాలాకు చెందినవాడు. అయితే ఇసెమిక్ స్ట్రోక్‌తో బాధపడుతోన్న చందన్ జిందాల్‌ను ఫిబ్రవరి 2న వినిట్సియాలోని ఆస్పత్రిలో చేర్పించారు. దీంతో భారత్‌లో ఉంటున్న చందన్ తల్లిదండ్రులు ఫిబ్రవరి 7న ఉక్రెయిన్ చేరుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న చందన్‌కు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో వైద్యులు సర్జరీ చేశారు. ఆరోగ్యం క్షీణించిన కారణంగా చందన్ మరణించినట్లు మంగళవారం వైద్య అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైన తర్వాత ప్రాణాలు కోల్పోయిన మొదటి విద్యార్థి కర్ణాటకకు చెందిన నవీన్ అనే సంగతి తెలిసిందే.
భారత పౌరులంతా వెంటనే ఖార్కివ్‌ను విడిచి వెళ్లండి, ఖార్కివ్‌లోని భారతీయ పౌరులందరికీ అలర్ట్ మెసేజ్ జారీ చేసిన ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయం
జిందాల్ మరణవార్త తెలిసిన ఆయన కుటుంబ సభ్యులు తీవ్రంగా విలపిస్తున్నారు.ఆయన తండ్రి భారత ప్రభుత్వానికి రాసిన లేఖలో తమ కుమారుని మృతదేహాన్ని రప్పించేందుకు సాయం చేయాలని కోరారు. కర్ణాటకకు చెందిన నవీన్ శేఖరప్ప మంగళవారం ఉక్రెయిన్‌లోని ఖార్కివ్‌లో జరిగిన పేలుళ్ళలో ప్రాణాలు కోల్పోయారు. ఆయన మృతదేహాన్ని రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్ గగనతలంలో ప్రయాణికుల విమానాల రాకపోకలపై నిషేధం అమలవుతోంది. కాబట్టి మృతదేహాలను తీసుకురావడానికి ఇతర మార్గాలను అన్వేషించవలసి ఉంటుంది.
ఇషెమిక్ స్ట్రోక్ వచ్చినపుడు మెదడుకు ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ సక్రమంగా అందవు. క్షణాల్లోనే బ్రెయిన్ సెల్స్ మరణిస్తాయి. దీనికి సరైన, అత్యవసర చికిత్స తప్పనిసరి. సాధ్యమైనంత త్వరగా చికిత్స అందితే మెదడుకు జరిగే నష్టాన్ని తగ్గించవచ్చు.