Chandigarh University MMS Row: అమ్మాయిలు స్నానం చేస్తున్న వీడియోలు బయటకు ఎందుకు వచ్చాయి, ఘటనపై దర్యాప్తు చేసేందుకు ముగ్గురు మహిళా అధికారులతో సిట్ ఏర్పాటు
దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) (3-Member All-Women SIT To Probe Incident ) ఏర్పాటు చేసింది.
Chandigarh, September 19: చండీగఢ్ యూనివర్సిటీ MMS వీడియో లీక్ ఘటనపై (Chandigarh University MMS Row) పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు ముగ్గురు మహిళా అధికారులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) (3-Member All-Women SIT To Probe Incident ) ఏర్పాటు చేసింది. ఈమేరకు సీఎం భగవంత్ మాన్ (Punjab CM Bhagwant Mann) ఆదేశాలు జారీ చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి గురుప్రీత్ దేవ్ పర్యవేక్షణలో సిట్ ఈ కేసును వేగంగా విచారించనుంది.
ఇప్పటికే యూనివర్సిటీ వీడియో లీక్ ఘటనలో మొత్తం ముగ్గురుని అరెస్టు చేశారు పోలీసులు. స్నానం చేస్తుండగా తానే స్వయంగా రికార్డు చేసుకున్న వీడియోను పంపిన అమ్మాయి, దీన్ని రిసీవ్ చేసుకున్న సిమ్లాకు చెందిన ఆమె బాయ్‌ఫ్రెండ్ సన్నీ మెహతాతో పాటు అతని స్నేహితుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సహకరించిన హిమాచల్‍ప్రదేశ్ పోలీసులకు పంజాబ్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు.
ఇక వీడియో లీక్ చేసిన అమ్మాయిని హాస్టల్ వార్డెన్ తిట్టిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియో లీక్ విషయాన్ని పోలీసులకు ముందుగా చెప్పనందుకు ఆమెను, మరో వార్డెన్‌ను కూడా అధికారులు సస్పెండ్ చేశారు.కాగా విద్యార్థినుల నిరసనలతో యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది.
సోమవారం నుంచి శనివారం(సెప్టెంబర్ 24) వరకు క్లాసులు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. అయితే విద్యార్థుల డిమాండ్లకు యాజమాన్యం అంగీకరించిందని, దీంతో వాళ్లు నిరసన విరమించుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు యూనివర్సిటీలో తమకు భద్రత లేదని కొంతమంది విద్యార్థినులు బ్యాగులు సర్ధుకుని ఇంటిబాట పట్టారు.
అసలేం జరిగింది ?
మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయం(ప్రైవేటు) ప్రాంగణ వసతిగృహంలో 4 వేలమంది విద్యార్థినులు ఉంటున్నారు. అందులోని ఒక విద్యార్థిని తన ఫోన్‌తో ఫొటోలు/వీడియోలు తీస్తుండటాన్ని కొంతమంది సహచర యువతులు గుర్తించారు. ఆ విషయంపై వార్డెన్‌కు ఫిర్యాదు చేశారు. పలువురు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటున్న తన స్నేహితుడికి పంపి, తర్వాత వాటిని డిలీట్ చేసినట్లు ఆమె అంగీకరించిందనీ వారు పేర్కొన్నారు.
అనంతరం హాస్టల్‌లోని దాదాపు 60 మంది విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలు ఎంఎంఎస్‌ల రూపంలో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమయ్యాయంటూ వార్తలొచ్చాయి. దీంతో వసతిగృహంలోని అమ్మాయిలంతా పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. ఆమె ఫోన్‌ను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్ విశ్లేషణ కోసం పంపారు. ఆమె తన సొంత వీడియోనే స్నేహితుడికి పంపినట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరిపిస్తామని, దోషులను కఠినంగా శిక్షిస్తామని సీఎం భగవంత్‌మాన్ హామీ ఇచ్చారు.
అయితే ఈ విషయంపై యాజమాన్యం స్పందించింది. మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారం, అర్థరహితం అని కొట్టిపారేసింది. యూనివర్సిటీలో ఒక్క అమ్మాయి ప్రైవేటు వీడియో మాత్రమే లీక్ అయినట్లు యాజమాన్యం స్పష్టం చేసింది. ఓ అమ్మాయి తన సొంత వీడియోను సోషల్ మీడియాలో తన బాయ్‌ఫ్రెండ్‌కు పంపిందని వెల్లడించింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో ఈ ఒక్క వీడియో తప్ప మరే ఇతర అమ్మాయిల వీడియోలు లీక్ కాలేదని తేలిందని చెప్పింది. 60 ప్రైవేటు వీడియోలు లీక్ అయ్యాయని మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డా.బవా స్పష్టం చేశారు. ఈ వదంతులను ఎవరూ నమ్మవద్దని సూచించారు.
అలాగే చండీగఢ్ యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా నిజం లేదని బవా చెప్పారు. ఏ ఒక్క విద్యార్థిని కనీసం ఆస్పత్రిలో కూడా చేరలేదని వెల్లడించారు. వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేశారని, కేసు విచారణలో పూర్తిగా సహకరిస్తామని స్పష్టం చేశారు.