Chhattisgarh: భార్య లేదని ప్రియురాలితో రూంలో నగ్నంగా.., సడన్‌గా ఎంట్రీ ఇచ్చిన భార్య, కోపం పట్టలేక ఇద్దరినీ బట్టల్లేకుండా రోడ్ల మీదకు ఈడ్చుకువచ్చింది, ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో ఘటన

Man and Woman Paraded Naked Over Affair (Photo-Video Grab)

Raipur, June 15: ఛత్తీస్‌గఢ్‌లోని కొండగావ్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తి(25).. స్థానికంగా మరో యువతి(19)తో వివాహేతర సంబంధం నడుపుతున్నాడు. ఈ క్రమంలో గత శనివారం భార్య(23) ఊరెళ్లిందనుకుని.. ఇద్దరు ఇంట్లోనే దుకాణం పెట్టారు. సరిగ్గా అదే సమయంలో అతని భార్య తిరిగి వచ్చింది. వాళ్లిద్దరి భాగోతాన్ని చూసి షాక్‌ తింది.

అంతటితో ఆగకుండా వాళ్లకు దుస్తులు వేసుకునే టైం కూడా ఇవ్వలేదు. చుట్టుపక్కల వాళ్ల సాయంతో అలాగే నగ్నంగా బయటకు (Woman Paraded Naked Over Affair) ఈడ్చుకొచ్చింది. ఆపై గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించింది. ఇందుకు సంబంధించిన వీడియోలు వాట్సాప్‌ గ్రూపుల్లో విపరీతంగా వైరల్‌ అయ్యాయి. జూన్‌ 11వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు.

షాకింగ్ న్యూస్... రోబోలకు ఫీలింగ్స్ వస్తున్నాయట, గూగుల్ ఇంజనీర్ తన సహోద్యోగితో కలిసి 'రోబో బాట్'తో చేసిన చాట్ బయటకు

పోలీస్‌ టీంను ఆ గ్రామానికి పంపించి.. ఘటనకు సంబంధించి వివరాలు సేకరించారు. బాధితుల స్టేట్‌మెంట్‌ల ప్రకారం.. ఫిర్యాదు నమోదు చేసుకున్నారు. ఆపై సదరు వ్యక్తి భార్యతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్‌ (His Wife Among 4 Arrested) చేసి స్టేషన్‌కు తరలించారు. తదుపరి విచారణ కొనసాగుతోందని అధికారి తెలిపారు.