Chhattisgarh Teacher: నాతో క్లోజ్‌గా ఉండండి, మీ ఫోన్ నంబర్ ఇవ్వండి, ఓ టీచర్ నిర్వాకం, అబ్బాయిల్ని చికెన్ తీసుకురావాలంటూ వేధింపులు,అదేమి లేదంటున్న చత్తీస్ ఘడ్ టీచర్, చర్యలు తీసుకుంటామన్న అధికారులు
ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల ఇవే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన గురువు అన్న పదానికే కళంకం తెచ్చేలా ఉంది.
Jashpur, December 9: విద్యా బుద్ధులు నేర్పించాలని గురువు దారి తప్పాడు. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఘటనలు చాలానే చూస్తున్నాం. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన గురువులు నీచపు పనులకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల ఇవే ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా చత్తీస్‌ఘడ్‌లో వెలుగులోకి వచ్చిన ఘటన గురువు అన్న పదానికే కళంకం తెచ్చేలా ఉంది. చత్తీస్‌ఘడ్ (Chhattisgarh) రాష్ట్రంలో జాస్ పూర్(Jashpur)లో తుమ్లా స్టేషన్ పరిధి(Tumla police station)లో గల ఓ స్కూలులో టీచర్ విద్యార్థిలను దారుణంగా వేధిస్తున్నాడు.
ఫోన్ నంబర్ ఇవ్వాలని.. బెదిరిస్తూ లైంగికంగాను వేధింపులకు పాల్పడుతున్నాడు. దీంతో అక్కడ బాలికలు స్కూల్ కు రావాలంటే భయపడుతున్నాడు. స్కూల్ కు రాకపోయినా..తాను చెప్పిన మాట వినకపోయినా..పరీక్షల్లో ఫెయిల్ చేస్తానని బెదిరిస్తున్నాడు. దీంతో బాలికలు స్కూల్ రాలేక..మానలేక..టీచర్ అసభ్య ప్రవర్తనలు భరించలేక మీడియా ముందు తమ గోడును వెళ్లబోసుకున్నారు.
ANI Tweet
12 క్లాస్ బాలికలు మాట్లాడుతూ..టీచర్ రాజేష్ భరద్వాజ్(teacher Rajesh Bhardwaj) ఫోన్ నంబర్ అడుగుతున్నారనీ..లైంగికంగా వేధిస్తున్నారనీ వాపోతున్నారు. అంతేకాదు మగపిల్లల్ని చికెన్ తీసుకురావాలని అడుగుతున్నారనీ లేకుండా పరీక్షలలో పాస్ చేయనని వేధిస్తున్నారని వాపోతున్నారు.
కాగా ఈ విషయం జిల్లా విద్యాశాఖాధికారి ఎన్ కుజూర్ కాగ్నిజెన్స్ దృష్టికి రావటంతో రాజేష్ భరద్వాజ్ ను విచారించగా..తాను ఎప్పుడూ ఇలాంటివి ఏమీ అడగలేదనీ చికెన్ తీసుకుని రమ్మని తాను విద్యార్థులను సరదాగా అడిగానని అంటున్నాడు. నాకు అమ్మాయిలపై ఎటువంటి దురుద్ధేశం లేదని బుకాయించాడు. కానీ విద్యార్ధీ..విద్యార్థినులంతా అదే విషయాన్ని చెప్పటంతో టీచర్ రాజేశ్ భరద్వాజ్ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.