Military Plane Missing: 38 మందితో వెళ్తున్న విమానం మిస్సింగ్, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్, అసలేం జరిగింది ?

38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేదు. అంటార్కిటికా వెళ్తున్న‌రూట్లో ఆ విమానం (Military Plane Missing)ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సీ-130 హెర్క్యూల్స్(C-130 Hercules) ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం ఆరు గంట‌ల‌కు విమానం మిస్సైంది.

Chilean Military Plane with 38 on Board Goes Missing (Photo-Getty)

Santiago, December 10: చిలీ (chile) దేశ‌ వైమానిక ద‌ళానికి చెందిన విమానం అదృశ్య‌మైంది. 38 మందితో వెళ్తున కార్గో సైనిక విమానం ఆచూకీ లేదు. అంటార్కిటికా వెళ్తున్న‌రూట్లో ఆ విమానం (Military Plane Missing)ఆ దేశ ఎయిర్‌ఫోర్స్ ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్న‌ది. సీ-130 హెర్క్యూల్స్(C-130 Hercules) ట్రాన్స్‌పోర్టు ఎయిర్‌క్రాఫ్ట్ స్థానిక కాల‌మానం ప్ర‌కారం ఉద‌యం ఆరు గంట‌ల‌కు విమానం మిస్సైంది. పుంటా ఏరినాస్ న‌గ‌రం నుంచి టేకాఫ్ తీసుకున్న త‌ర్వాత అది ఆచూకీలేదు. విమానంలో 17 మంది సిబ్బంది, 21 మంది ప్ర‌యాణికులు ఉన్నారు. మిస్సైన విమానం గురించి రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది.

ఈ ఘటనపై ఆ దేశ ఆధ్యక్షుడు సెబాస్టియన్ పినెరా స్పందించారు. ‘రక్షణ శాఖ, విమానయాన శాఖ మంత్రులు ఎప్పటికప్పుడు ఈ ఘటనకు సంబంధించిన విషయాలను, గాలింపు చర్యలను పర్యవేక్షించాలి’ అని ఆదేశించారు. కాగా సీ-130 విమానం సోమావారం సాయంత్రం 4:55 గంటలకు గగనతలంతోకి ప్రవేశించింది. రాజధాని శాంటియాగో నుంచి 3,000 కిలోమీటర్ల వరకు విమానానికి సంబంధించిన సమాచారం ఎయిర్‌పోర్టు అధికారుల పర్యవేక్షణలో ఉంది.

కాని ఒక్కసారిగా 6:13 గంటలకు రాజధాని శాంటియాగోకు దక్షిణంగా ఉన్న పుంటా అరేనాస్ నగరం దగ్గర విమనానం సిగ్నల్‌ కోల్పోయిందని అధికారులు తెలిపారు. వాతావారణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదని ఎయిర్‌పోర్టు అధికారులు పేర్కొన్నారు. గల్లంతైన విమానానికి సంబంధించిన గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వైమానిక దళానికి చెందిన జనరల్ ఎడ్వర్డో మోస్క్వైరా తెలిపారు. ఈ విమాన పైలట్‌కి విస్తృతమైన అనుభవవం ఉందని ఆయన పేర్కొన్నారు.