Chinese Firm’s Contract Cancelled: చైనాకు రైల్వే డీఎఫ్‌సీసీఐఎల్‌ భారీ షాక్, రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేస్తున్నట్లు వెల్లడి, చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం

తాజాగా రైల్వే శాఖకు (Indian Railways) చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(DFCCIL) చైనాకు గట్టి షాకిచ్చింది. చైనా సంస్థ యొక్క రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Representational Image (Photo Credits: Flickr) .. Read more at: https://www.latestly.com/india/news/chinese-companys-contract-cancelled-by-dfccil-an-indian-railways-psu-citing-poor-progress-1831059.html

New Delhi, June 18: సరిహద్దుల్లో భారత సైనికుల మరణానికి కారణమైన చైనాపై ఇండియా అన్నివైపుల నుంచి ప్రతీకారం తీర్చుకుంటోంది. తాజాగా రైల్వే శాఖకు (Indian Railways) చెందిన డెడికేటెడ్‌ ఫ్రైట్‌ కారిడార్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌(DFCCIL) చైనాకు గట్టి షాకిచ్చింది. చైనా సంస్థ యొక్క రూ. 470 కోట్ల విలువైన ప్రాజెక్టు కాంట్రాక్టును రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. చైనాకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వబోతున్న ఇండియా, 4జీ అప్‌గ్రేడ్‌‌లో చైనా పరికరాల వినియోగం బంద్, బీఎస్ఎన్ఎల్ ఇతర టెలికం సంస్థలకు త్వరలో డాట్ ఆదేశాలు

కాన్పూర్‌- దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ సెక్షన్‌ మధ్య 417 కిలోమీటర్ల పొడవు గల రైలు మార్గంలో సిగ్నలింగ్‌, టెలికమ్యూనికేషన్‌ సదుపాయాల కల్పనకై బీజింగ్‌ నేషనల్‌ రైల్వే రీసర్చ్‌, డిజైన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సిగ్నల్‌ అండ్‌ కమ్యూనికేషన్‌తో 2016లో డీఎఫ్‌సీసీఐఎల్‌ ఒప్పందం కుదుర్చుకుంది.

Here's ANI Tweet

ఈ డీల్‌ కుదిరి నాలుగేళ్లవుతున్నా ఇంతవరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదు. దీంతో చైనీస్‌ సంస్థ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన డీఎఫ్‌సీసీఐఎల్‌ కాంట్రాక్టును రద్దు (Chinese Firm’s Contract Cancelled) చేసింది. శాంతిని కోరుకుంటున్నాం, సరైన సమయంలో ప్రతి దాడి తప్పదు, చైనాకు ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరిక, అమర వీరులకు నివాళి అర్పించిన ప్రధాని

అగ్రిమెంట్‌ను ఖరారు చేసే సాంకేతికపరమైన పత్రాలను(టెక్నికల్‌ డాక్యుమెంట్లు) చైనీస్‌ సంస్థ ఇంతవరకు అందజేయలేదని అధికారులు వెల్లడించారు. సైట్‌ దగ్గరికి తమ ఇంజనీర్లు, అధికారులను ఒక్కసారి కూడా పంపలేదని డీఎఫ్‌సీసీఐఎల్‌ అధికారులు తెలిపారు. ఈ విషయాల గురించి వివిధ స్థాయి అధికారులతో చర్చించినప్పటికీ ఎటువంటి సానుకూల స్పందన రాలేదన్నారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు రద్దు చేసేందుకు నిర్ణయించామని తెలిపారు.

కాగా గాల్వన్‌ లోయ ప్రాంతంలో జరిగిన చైనా దాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది. ఈ క్రమంలో చైనాపై ఆర్థిక ఆంక్షలను మరింత కఠినతరం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే డీఎఫ్‌సీసీఐఎల్ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif