New Delhi, June 17: లడఖ్ యొక్క గాల్వన్ వ్యాలీలో చైనా సైన్యంతో హింసాత్మక ఘర్షణల సమయంలో (India-China Border Face-off) 20 మంది భారత ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ప్రధాని నరేంద్ర మోడీ ( Prime Minister Narendra Modi) బుధవారం అమరవీరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా చైనాకు ప్రధాని మోదీ (PM Modi) కఠిన హెచ్చరిక జారీ చేశారు.
‘భారతదేశం శాంతిని కోరుకుంటుంది, కానీ ప్రేరేపించబడినప్పుడు, భారతదేశం వారికి తగిన సమాధానం ఇవ్వగలదు, అది ఏ విధమైన పరిస్థితి అయినా ’ అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. COVID-19 సంక్షోభం గురించి చర్చించడానికి PM-CM లు సమావేశం ప్రారంభమయ్యే రెండు నిమిషాల ముందు ఈ ట్వీట్ చేశారు. భారతదేశం శాంతిని కోరుకుంటుందని, కానీ అది సార్వభౌమాధికారంతో కూడుకున్నదని, తమకు దేశ ఐక్యత, సార్వభౌమత్వం చాలా ముఖ్యమైన అంశాలని స్పష్టం చేశారు. ఘర్షణకు ప్రధాన కారణం అదేనా? ఈ నెల 19న ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశం, అన్ని పార్టీలకు పిలుపు, మీ త్యాగం దేశం ఎన్నడూ మరచిపోదన్న రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్
Prime Minister Narendra Modi's Statement:
#WATCH India wants peace but when instigated, India is capable of giving a befitting reply, be it any kind of situation: Prime Minister Narendra Modi pic.twitter.com/rJc0STCwBM
— ANI (@ANI) June 17, 2020
‘అమరులైన బలిదానాలు ఊరికేపోవు. ఈ అంశంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు. భారత్ శాంతి కోరుకుంటోంది. కానీ, సరైన సమయం వస్తే ధీటుగా జవాబు ఇవ్వడానికి భారత్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. అమర జవాన్ల విషయంలోదేశం గర్వ పడుతుంది. వారు పోరాడుతూ ప్రాణాలు అర్పించారు.’ అని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పిలుపు మేరకు, ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు రెండు నిమిషాల పాటు మౌనం పాటించి అమర జవాన్లకు అంజలి ఘటించారు. దేశ రక్షణ కోసం అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
భారత, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు (India-China Border Face-off) నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన దాడిలో గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత, చైనా సరిహద్దు విషయాన్ని చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు అఖిల పక్ష భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం (PMO Office) పేర్కొన్నది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు పాల్గొంటారని పీఎంవో ఓ ప్రకటనలో తెలియజేసింది.